ఈ కారణంగా Nokia యొక్క స్మార్ట్ఫోన్లు ఇప్పుడు చాలా ప్రత్యేకంగా ఉంటాయి
కంపెనీ యొక్క నోకియా 6 మరియు నోకియా 5 స్మార్ట్ఫోన్లు కోసం ఒరియో బీటా టెస్టింగ్ త్వరలో విడుదల చేయబడుతుందని HMD గ్లోబల్ యొక్క CPO Juho Sarvikas ధృవీకరించారు
త్వరలో నోకియా 8 తర్వాత ఓరియో బీటా టెస్టింగ్ ఈ ఫోన్ లకు ప్రకటించబడింది. నోకియా 6 మరియు నోకియా 5 లకు ఈ అప్డేట్ ఏ డేట్ న వస్తుందో తెలియదు.ఇటీవలే, HMD గ్లోబల్ భారతదేశంలో నోకియా 2 స్మార్ట్ఫోన్ ని ప్రారంభించింది, ఇది నవంబర్ 24 నుండి టాప్ మొబైల్ రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. నోకియా 2 ఒక 5 అంగుళాల 720p HD డిస్ప్లేను కలిగి ఉంది మరియు ఈ పరికరం క్వాల్కమ్ యొక్క స్నాప్డ్రాగెన్ 212 చిప్సెట్తో అమర్చబడి ఉంది. Qualcomm ఈ ఎంట్రీ లెవెల్ చిప్సెట్ 4G LTE కనెక్టివిటీ వస్తుంది మరియు మంచి బ్యాటరీ లైఫ్ అందిస్తుంది . ఈ స్మార్ట్ఫోన్ 1GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది, ఇది SD కార్డ్ ద్వారా మెరుగుపరచబడుతుంది.
కెమెరా గురించి మాట్లాడితే , ఈ పరికరం 8MP ప్రాధమిక కెమెరా మరియు 5MP సెకండరీ కెమెరా కలిగి ఉంది. ఇతర నోకియా స్మార్ట్ఫోన్ల మాదిరిగానే, ఇది ఆండ్రాయిడ్ నౌగాట్ లో స్టాక్ ఎక్స్పీరియన్స్ తో నడుస్తుంది మరియు రాబోయే నెలల్లో అది Android 8.0 Oreo కు అప్గ్రేడ్ చేయబడుతుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది. ఇది గూగుల్ అసిస్టెంట్తో వచ్చిన మొట్టమొదటి బడ్జెట్ స్మార్ట్ఫోన్. నోకియా 2 స్మార్ట్ఫోన్లో 4100mAh బ్యాటరీ ఇవ్వబడింది మరియు కంపెనీ రెండు రోజుల పాటు పనిచేయగలదని పేర్కొంది.