1 మిలియన్ రిజిస్ట్రేషన్స్ క్రాస్ చేసిన నోకియా 6

Updated on 31-Mar-2017
HIGHLIGHTS

నోకియా 6 చైనా లో JD.com లో తన రిజిస్ట్రేషన్ తో ఒక సంచలనం

1 మిలియన్ రిజిస్ట్రేషన్స్ క్రాస్ చేసిన నోకియా 6

ఒకప్పుడు  నోకియా  అంటే   మొబైల్స్  లో రారాజు , మార్కెట్  లో  ఎన్ని  బ్రాండ్స్  వున్నా  ఒకప్పుడు  నోకియా  కు వున్నా క్రేజ్  వేరని  చెప్పాలి.అలాంటి  నోకియా  కొంత  కాలం  ముందు  విండోస్  ఫోన్స్  రిలీజ్  చేసి  అనేక  నష్టాలను  చవి చూసింది.  తనని  అమ్ముకునే  స్థాయిలో  ఉనికిని  కోల్పోయింది . కానీ  ఆశ్చర్యకరంగా  మళ్ళీ  ఆండ్రాయిడ్  బాట  పట్టి  సరికొత్త  మోడల్స్  తో మనముందుకు  వస్తోంది.నోకియా  బ్రాండ్  నుంచి సరికొత్త  ఆండ్రాయిడ్ స్మార్ట్  ఫోన్స్  రీలీజ్  అవనున్నాయి.  వాటిలో ఒక ఫీచర్  ఫోన్ కూడా  వుంది. నోకియా 3, నోకియా 5, నోకియా 6, నోకియా 7, నోకియా  8 స్మార్ట్  ఫోన్స్  ఇండియాలో  లాంచ్  అవనున్నాయి.మరియు వీటితో  పాటుగా  ఫీచర్  ఫోన్ అయిన  నోకియ 3310 కూడా  సరికొత్త  హంగులతో  మనముందుకు  రానుంది. అలాగే వీటికి  సంభందిత  లీక్స్  మరియు  స్కెచెస్  సోషల్  మీడియా  లలో  హల్చల్  చేస్తున్నాయి.అయితే ఇప్పడు  సరికొత్తగా  నోకియా  బ్రాండ్  నుంచి వచ్చిన  నోకియా  6 చైనా  లో JD.com లో  తన రిజిస్ట్రేషన్  తో ఒక సంచలనం  సృష్టించింది.దాదాపు 1 మిలియన్  కి పైగా  రెజిస్ట్రేషన్స్  ను క్రాస్ చేసింది  అంటే  చూడండి  నోకియా  కి ఇప్పటికి  ఎంత  జనాదరణ  వుందో  ఫోన్  ఇండియా లో చాల  త్వరలో  రిలీజ్  అవనుంది.  ఇప్పటికే  అనేకమంది  నోకియా  అభిమానులు  దీనికోసం, కళ్ళు  కాయలు  కాచేలా  ఎదురుచూస్తున్నారు 
ఇండియా  లో కూడా  రిలీజ్  అయ్యి మరిన్ని  రికార్డ్స్  ను బ్రేక్  చేయనుందని  నోకియా  ఆశాభావం  వ్యక్తం  చేస్తుంది. 

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

నోకియా  6 స్టార్టింగ్ వేరియెంట్  ధర 16,100 మరియు నోకియా 6 స్పెషల్ ఎడిషన్ ధర  రూ.21,000
ఈ నోకియా 6 స్పెక్స్ గమనిస్తే 5.5 ఇంచెస్  ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్.ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. కలర్స్  (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Xiaomi Redmi 3S (Silver, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి

Xiaomi Redmi 3S Prime (Gold, 32GB), అమెజాన్ లో 8,999 లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :