నోకియా 5.1 ప్లస్ మొదటి సేల్ నేడే : ఈ సేల్ మద్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్ కార్ట్ ద్వారా జరగనుంది
రూ . 10,999 ధరతో, విడుదలైన ఈ నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు 12 PM సమయం వద్ద మొదటిసారిగా అమ్మకానికి అందుబాటులో ఉండనుంది.
గత నెలలో, HMD గ్లోబల్ దాని సరసమైన మొబైల్ ఫోన్ నోకియా 5.1 ప్లస్ ని ప్రారంభించింది, దీని మొట్టమొదటి సెల్ ఈ రోజు ఫ్లిప్కార్ట్ నుండి మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమవుతుంది. నోకియా 5.1 ప్లస్ ధర రూ .10,999 గా ఉంది. మీరు ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటే, ఈ సెల్ జరిగే సమయానికంటే కంటే కొంతముందే వెబ్సైట్లో మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఆన్లైన్లో ఉండండి.
నోకియా 5.1 ప్లస్ ధర మరియు ఆఫర్లు
ఈ నోకియా 5.1 ప్లస్ ధర రూ 10,999 గా ఉంటుంది, కానీ ఎయిర్టెల్ వినియోగదారులకు 1,800 రూపాయల తక్షణ క్యాష్ బ్యాక్ మరియు 240GB 3G / 4G డేటా పొందుతారు, దీని కోసం వినియోగదారులు రూ . 199, రూ . 249 లేదా రూ . 448 ప్లాన్లలో ఒకదాన్ని12 నెలలకి రీఛార్జ్ చేయాలి.
నోకియా 5.1 ప్లస్ స్పెసిఫికేషన్స్
ఈ నోకియా 5.1 ప్లస్ ఒక 5.86 అంగుళాల HD + డిస్ప్లేను 19: 9 యొక్క యాస్పెక్ట్ రేషియాతో మరియు 84 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది . ఈ ఫోన్ ఒక 3 జీబి ర్యామ్తో ఒక మీడియా టెక్ హీలియో P60 చిప్సెట్తో శక్తిని కలిగి ఉంది మరియు 32GB ఆన్బోర్డ్ స్టోరేజ్తో లభిస్తుంది, ఇది 256GB వరకు విస్తరించడానికి ఒక ఎంపికను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ఒక f / 2.0 ఎపర్చరుతో 13MP + 5MP లెన్సులతో డ్యూయల్ – రియర్ కెమెరా సెటప్ ఉంటుంది మరియు ముందు భాగంలో, f / 2.2 ఎపర్చర్ మరియు 80.4-డిగ్రీ కోణం వీక్షణతో 8MP యూనిట్ ఉంది.
ఈ సంస్థ అందించే ఇతర స్మార్ట్ఫోన్ల మాదిరిగానే, నోకియా 5.1 ప్లస్ కూడా Android One వన్ కార్యక్రమం కింద వస్తుంది, దీని అర్థం స్మార్ట్ఫోన్ సకాలంలో భద్రత మరియు OS అప్డేట్లను పొందుతుంది. HMD గ్లోబల్ తెలిపిన ప్రకారం, నోకియా 5.1 ప్లస్ ఆండ్రాయిడ్ 9 పైకి అప్డేట్ చేయబడే మొట్టమొదటి పరికరాల్లో ఒకటిగా ఉంటుంది. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్ను 3060 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సమర్థిస్తుంది. ఇది 12 గంటల వీడియో ప్లేబ్యాక్ను అందిస్తుందని సంస్థ పేర్కొంది