Nokia 3310 ఇప్పుడు అన్ని లీడింగ్ రిటైల్ స్టోర్స్ లో

Updated on 01-Jun-2017
HIGHLIGHTS

Nokia యొక్క ఫీచర్ ఫోన్ 3310 మే లో లాంచ్ చేశారు

Nokia  యొక్క ఫీచర్ ఫోన్  3310  మే లో లాంచ్ చేశారు . లాంచ్ తరువాత  మంచి డిమాండ్ కూడా సంతరించుకుంది .  మరియు అతి త్వరగా అవుట్ ఆఫ్  స్టాక్  కూడా అయ్యింది . 
దీని తరువాత సోషల్  మీడియా లో వచ్చిన సమాచారం ప్రకారం  HMD  గ్లోబల్ ఈవిధంగా  కన్ఫర్మ్  చేసింది .  Nokia 3310  ఇప్పుడు అన్ని  లీడింగ్  రిటైల్  స్టోర్స్  లో అందుబాటులో ఉంటుంది. 
Nokia 3310  యొక్క క్లియర్ స్పెక్స్ గమనిస్తే  2.4  ఇంచెస్  QVGA  స్క్రీన్ కలిగి వుంది . 
మరియు ఈ డివైస్ లో 16MB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు .  దీనిని  32GB  వరకు ఎక్స్  పాండ్  చేసుకోవచ్చు . Nokia 3310  లో 1200mAh  బ్యాటరీ  22.1  గంటల  టాక్  టైం ఇస్తుంది .   మరియు ఈ డివైస్ 31  రోజుల స్టాండ్బై  టైం ని ఇస్తుంది.  
 ఇవే కాక ఈ డివైస్ లో  51  గంటల   MP3  ప్లే బ్యాక్ మరియు  39  గంటల  fm  రేడియో  నడుస్తుంది. కనెక్టివిటీ  కోసం ఈ ఫోన్ లో   మైక్రో  usb  2.0,  బ్లూటూత్ 3.0  మరియు  3.5mm  ఆడియో జాక్  ఇవ్వబడ్డాయి . ఇవే కాక ఈ డివైస్ లో 2G  నెట్వర్క్  కనెక్టివిటీ  కలదు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :