Nokia 3310 4G స్మార్ట్ఫోన్ YunOS పై నడుస్తుంది …..

Nokia 3310 4G స్మార్ట్ఫోన్ YunOS పై నడుస్తుంది …..

HMD గ్లోబల్ తన  వెబ్సైట్లో నోకియా 3310 ని లిస్ట్  చేసింది. పేరు సూచించినట్లుగా, ఈ కొత్త ఫోన్ నోకియా 3310 యొక్క అప్గ్రేడ్ వెర్షన్ , దీనిని  గత సంవత్సరం కంపెనీ ప్రారంభించింది. కొత్త ఫోన్ 4G సపోర్ట్ తో పాటు, YunOS నడుస్తుంది, ఇది Android యొక్క ఫోర్క్ వెర్షన్ .అదనంగా, ఈ కొత్త ఫోన్ 256MB / 512MB స్టోరేజ్ ను అందిస్తుంది, దీనిని  మైక్రోఎస్డీ కార్డ్  ద్వారా 64GB వరకు విస్తరించవచ్చు. నోకియా 3310 నోకియా సీరీస్ 30+ OS లో నడుస్తుంది మరియు 16MB స్టోరేజ్ ను అందిస్తుంది, ఇది 32GB కి పెంచబడుతుంది.

దీనితో పాటు, నోకియా 3310 4G స్పెక్స్  చాలా వరకు  ముందున్న ఫోన్స్ కి సమానంగా ఉంటుంది. ఈ ఫోన్ 240×320 పిక్సెల్ రిజల్యూషన్తో 2.4 అంగుళాల QGA డిస్ప్లే ను అందిస్తుంది. ఫోన్ వెనుక కెమెరా LED ఫ్లాష్ తో 2MP ఉంది. ఫోన్ యొక్క బ్యాటరీ 1200 mAh ముందు ఫోన్ వలె ఉంటుంది. కొత్త ఫోన్ యొక్క గరిష్ట స్టాండ్బై టైమ్ 15 రోజులు , అయితే గత ఏడాది లాంచ్ అయిన నోకియా 3310 గరిష్టంగా 25.3 రోజుల స్టాండ్బై సమయాన్ని విడుదల చేసింది. కొత్త ఫోన్ నోకియా 3310 4G ధర మరియు లభ్యత గురించి ప్రస్తుతం సమాచారం లేదు.  మరియు MWC లో దాని ధర మరియు లభ్యత వెల్లడి చేయబడుతుందని భావిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, రిలయన్స్ జియో ఈ ఫోన్ ని  బండిల్  డేటా మరియు కాలింగ్ ఆఫర్లతో లాంచ్ చేయటానికి  HMD గ్లోబల్తో చర్చలలో ఉంది . అదనంగా, గ్లోబల్ ఎన్-గేజ్ మరియు E72 యొక్క అప్గ్రేడ్డ్ వేరియంట్ ని  విడుదల చేయడానికి HMD సిద్ధమవుతోంది. ఈ రెండు పరికరాలను 4G మద్దతుతో మరియు అప్గ్రేడెడ్ స్పెసిఫికేషన్లతో ప్రారంభించవచ్చు.

 

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo