నోకియా 8 కోసం ఒరియో అప్డేట్ అధికారికంగా విడుదలైంది మరియు నోకియా యొక్క ఫోన్స్ కోసం అనేక అప్డేట్ లు లైన్ లో ఉన్నాయి.
అక్టోబర్లో నోకియా 3 కి 7.1.2 అప్డేషన్ వస్తుందని కంపెనీ వాగ్దానం చేసింది , అయితే ఈ అప్డేట్ ఈ డివైస్ కి లభించలేదు మరియు ఇప్పటికీ నోకియా 3 Android 7.0 పై పనిచేస్తుంది, ఇప్పుడు ఈ డివైస్ ఆండ్రాయిడ్ ఓరియోలో అప్డేట్ తో రానుంది . HMD గ్లోబల్ యొక్క చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ Juho Sarvikas తన ట్విట్టర్ అకౌంట్ నుండి యూజర్ ప్రశ్నకు సమాధానం ద్వారా ఈ విషయం ధ్రువీకరించారు.
https://twitter.com/sarvikas/status/936817515316912129?ref_src=twsrc%5Etfw
అయితే, ఈ అప్డేట్ విడుదలకు తేదీ ఏదీ నివేదించబడలేదు. నోకియా 3 ఒరియో అప్డేట్ కోసం ఇంకా సమయం పట్టవచ్చు .
నోకియా 3 ఫోన్లో 5-అంగుళాల డిస్ప్లే ఉంది, ఇది గొరిల్లా గ్లాస్ తో ప్రొటెక్టెడ్ అయి ఉంటుంది. ఈ ఫోన్ మీడియా టెక్ 6737 SoCలో పనిచేస్తుంది. ఈ ఫోన్లో 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఈ పరికరం 2650mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్లో, ప్రైమరీ మరియు సెకండరీ రెండు కెమెరాలు 8 మెగాపిక్సెల్స్ ఉన్నాయి.