నోకియా ప్లే స్టోర్ లో తన కెమెరా యాప్ ని నోకియా 3 కోసం అప్డేట్ చేసింది, అయితే కంపెనీ స్పెక్స్ ను షేర్ చేయనప్పటికీ, నోకియా 3 యొక్క కెమెరాకు డీసెంట్ డీటెయిల్ లెవెల్స్ కలిగి ఉన్నాయి, అయితే కార్నర్స్ లో సాఫ్ట్ నెస్ నాయిస్ మరియు ఆటోఫోకస్లు నిరాశపరిచే విధంగా వున్నాయి .Nokia 3 ఫోన్ లో 5ఇంచెస్ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వుంది . మీడియా టెక్ 6737 SoC పై పని చేస్తుంది . 2GB RAM అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . బ్యాటరీ 2630mAH .ఈ ఫోన్ ప్రైమరీ అండ్ సెకండరీ రెండూ కూడా 8 మెగా పిక్సల్స్ .
ఈ సంవత్సరం జూన్ 13 న భారతదేశంలో నోకియా 3 స్మార్ట్ఫోన్ ప్రారంభించబడింది, ఈ పరికరంతో పాటు HMD గ్లోబల్ దాని రెండవ డివైస్ నోకియా 5 ను లాంచ్ చేసింది . 5.2 అంగుళాల కాంపాక్ట్ HD డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ కి 2GB RAM ఉంది, స్నాప్డ్రాగెన్ 430 ప్రాసెసర్ , 3000mAH బ్యాటరీ ఇవ్వబడింది. నోకియా 5 లోఇంటర్నల్ స్టోరేజ్ 16GB ఉంది, ఇది 128GB కు పెంచబడుతుంది.
మీరు నోకియా 3 ను ఉపయోగిస్తున్నట్లయితే, మీ ఫోన్ యొక్క కెమెరా యాప్ ని అప్ డేట్ చేసి, నోకియా 3 యొక్క కెమెరా ఎంత మెరుగుఅయ్యిందో చూడండి.