Nokia 3, 5 మరియు 6 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ జూన్ నెలలోనే గ్లోబల్ లాంచ్ చేస్తుంది .

Updated on 03-Jun-2017
HIGHLIGHTS

HMD గ్లోబల్ ఈ నెలమొదట్లో నే Nokia 3310 ని లాంచ్ చేసింది .

HMD  గ్లోబల్ ఈ నెలమొదట్లో  నే  Nokia 3310  ని లాంచ్ చేసింది .  ఇప్పుడు   Nokia 3, 5  మరియు  6  ఆండ్రాయిడ్  స్మార్ట్ ఫోన్స్ జూన్  నెలలోనే  గ్లోబల్ లాంచ్ చేస్తుంది . 
ఈ  సమాచారం  ,నోకియా ద్వారా దాని స్వంత ట్విట్టర్  అకౌంట్ లో ఒక ప్రశ్నకు సమాధానంగా నివేదించబడింది.  ట్విట్టర్ లో ఒక యూజర్ భారత్ లో Nokia 6  ఎప్పుడు లాంచ్ అవుతుంది అని అడిగాడు . అప్పుడు  కంపెనీ  జూన్ లో లాంచ్ అవుతుందని రిప్లై  ఇచ్చింది.  కానీ తేదీ  అనేది వెల్లడించలేదు .  ముందు కూడా సేమ్  ఇదే  విషయం  బయటకు పొక్కింది  ఈ  ఏడాది  2 హాఫ్  లో  లాంచ్ చేయబడుతుంది  అని.  

 ప్రస్తుతం  వచ్చిన NPU  రిపోర్ట్  ప్రకారం  Nokia 3, 5  మరియు 6  భారత్  లో  13  జూన్  లో ప్రవేశ  పెట్టబడుతుంది . మరియు దీనికంటే  ముందుగానే  Nokia 3  మార్కెట్  లోకి రాబోతుంది . దీని తరువాత  వరుసగా Nokia 5  మరియు  Nokia 6  మార్కెట్ లోకి  వస్తున్నాయి .

Connect On :