నోకియా 2780 ఫ్లిప్: మరొక ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.!
నోకియా వరుసగా ఫ్లిప్ ఫోన్లను విడుదల చేస్తోంది
కొత్త ఫోన్ ఫ్లిప్ ఫోన్ Nokia 2780 Flip ను విడుదల చేసింది
ఈ ఫోన్ అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది
నోకియా వరుసగా ఫ్లిప్ ఫోన్లను విడుదల చేస్తోంది. ఇటీవలే, Nokia 2660 Flip ఫోన్ ను లాంచ్ చేసిన నోకియా, ఇప్పుడు కొత్త ఫ్లిప్ ఫోన్ Nokia 2780 Flip ను విడుదల చేసింది. నోకియా ఈ లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ ను క్వాల్కమ్ ప్రోసెసర్ తో తీసుకొచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది. నోకియా లేటెస్ట్ గా లాంచ్ చేసిన ఈ నోకియా 2780 ఫ్లిప్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోకియా 2780 ఫ్లిప్: ధర
నోకియా 2780 ఫ్లిప్ ఫీచర్ ఫోన్ కంపెనీ US లో మాత్రమే విడుదల చేసింది. ఈ ఫోన్ ఇతర దేశాల్లో విడుదల చేస్తుందో లేదో అనే విషయాన్ని తెలుపలేదు. ఈ ఫోన్ బ్లూ మరియు రెడ్ రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది మరియు ఇది $89.99 ధరతో లాంచ్ చెయ్యబడింది. అంటే, రూపాయితో పోలిస్తే ఇది దాదాపుగా రూ. 7,399 రూపాయలగా ఊహించవచ్చు.
నోకియా 2780 ఫ్లిప్: స్పెక్స్
ఇక నోకియా 2780 ఫ్లిప్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 2.7 ఇంచ్ మైన్ TFT స్క్రీన్ తో వస్తుంది. అంటే, మీకు స్పష్టమైన మరియు పెద్ద రూపాన్ని డిస్ప్లే పైన అందిస్తుంది. అలాగే, 1.77 ఇంచ్ ఫ్రంట్ డిస్ప్లే ఇన్కమింగ్ కాల్ లను సులభంగా గుర్తించేలా చేస్తుంది. ఈ ఫోన్ లో బిగ్ బటన్స్ అందుతాయి మరియు చాలా ఈజీగా మెసేజ్ టైపింగ్ చేయటానికి సహాయ పడుతుంది.
ఈ ఫోన్ 5MP కెమెరాను కలిగి వుంది మరియు దీనికి జతగా LED ఫ్లాష్ ని కూడా అందించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క 214 చిప్ సెట్ తో వస్తుంది. ఈ ఫోన్ కేవలం సింగల్ సిమ్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది మరియు 512MB ర్యామ్ + 4GB ఇంటర్నల్ స్టోరేజిలను కలిగివుంది.