Nokia 2 స్మార్ట్ ఫోన్ 4000mAh బ్యాటరీ తో.

Nokia 2  స్మార్ట్ ఫోన్ 4000mAh బ్యాటరీ  తో.

నోకియా 2 యొక్క అఫీషియల్ అనౌన్సమెంట్ కు ముందే , ఇది US రిటైలర్ చే  లిస్ట్ చేయబడింది.లిస్ట్ ద్వారా తెలుస్తున్నదేమిటంటే ఈ ఫోన్ ఇంచుమించు $99ధరలో అందుబాటులో ఉంటుంది . ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో Xiaomi యొక్క Redmi సిరీస్ మరియు మిగతా ఫోన్స్ కి గట్టి పోటీ ఇవ్వనుంది . 

అమెరికాలోని ఎలక్ట్రానిక్ రీటైలర్ B & H లిస్ట్ లో నోకియా 2 జోడించబడింది, ఇక్కడ ఈ ఫోన్ ధర  $ 99 (దాదాపు రూ .6,500). ఈ లిస్ట్ ను మొదటిసారి WinFuture లో వీక్షించారు. నోకియా 2 యొక్క USP 4000mAh బ్యాటరీని కలిగి ఉంది, మిగిలిన ఫీచర్స్  సాధారణమైనవి. ఈ హ్యాండ్ సెట్ ఈ రిటైలర్ ద్వారా    TA-1035 మోడల్ నంబర్ తో  చూపబడుతుంది. డ్యూయల్-సిమ్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది .ఈ స్మార్ట్ఫోన్ బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

నోకియా 2 మొదటిసారి GeekBench లిస్ట్ లో కనిపించింది, ఈ హ్యాండ్సెట్ స్నాప్డ్రాగెన్ 210 చిప్సెట్ మరియు 1GB RAM కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ 8GB లేదా 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది అని భావిస్తున్నారు. ఈ ఫోన్ కి  FCC సర్టిఫికేషన్ లభించింది, ఇది 5 అంగుళాల డిస్ప్లేతో లభిస్తుంది మరియు ఇది Lumia 620 డిజైన్ లో రూపొందించబడింది.

HMD గ్లోబల్ యొక్క అన్ని నోకియా బ్రాండెడ్ ఫోన్స్ వలె, నోకియా2 Android 7.0 లో  నడుస్తుంది . ఈ ఫోన్ యొక్క లభ్యత లేదా ప్రీ ఆర్డర్  గురించి ప్రస్తుతం సమాచారం లేదు, కానీ ఈ ఫోన్ వచ్చే నెల నుండి అమ్మడానికి అందుబాటులో ఉంటుంది.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo