HMD Global యొక్క తదుపరి రెండు స్మార్ట్ ఫోన్స్ Nokia 2 అండ్ Nokia 9 యొక్క ఇమేజెస్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి . ఆశాజనకంగా HMD Global ఈ ఫోన్స్ ని తన లైన్ అప్ లో అతి త్వరగా ప్రవేశపెడుతుంది . దీనిలో Nokia 3, Nokia 5, Nokia 6 అండ్ Nokia 8 లు కలవు . అలానే Nokia 9 అండ్ Nokia 2 గురించి ముందే ఎన్నో లీక్స్ వచ్చాయి .
Nokia 9 కంపెనీ యొక్క తదుపరి ఫ్లాగ్షిప్ డివైస్ 3D గ్లాస్ బ్యాక్ తో వస్తుంది మరియు వైర్ లెస్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది . ఈ లీక్ ఇమేజ్ ద్వారా Zeiss లెన్స్ తో డ్యూయల్ రేర్ కెమెరా ఉన్నట్లు తెలుస్తుంది . మరియు రేర్ ప్యానెల్ పై ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు .
Nokia 9 లో సన్నని బెజెల్స్ టాప్ డిసైన్ ఇవ్వబడింది . మరియు దీనిలో OLED డిస్ప్లే కలదు . మరియు ఈ ఫోన్ 6GB అండ్ 8GB వేరియంట్స్ లో వస్తుంది మరియు దీనిలో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . ఈ ఫ్లాగ్షిప్ డివైస్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది . Nokia 9 యొక్క ధర సుమారు €749 ( Rs 57,500) వరకు ఉంటుంది .
Nokia 2 స్మార్ట్ ఫోన్ HMD Global యొక్క ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లైన్ అప్ యొక్క తదుపరి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అవుతుంది . ఈ హ్యాండ్ సెట్ లో 5 ఇంచెస్ డిస్ప్లే ఇవ్వబడింది . మరియు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 212 మొబైల్ చిప్సెట్ , 1GBRAM అండ్ 16GB స్టోరేజ్ తో వస్తుంది మరియు డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా . ఈ ఫోన్ లో 8 ఎంపీ రేర్ కెమెరా అండ్ 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలవు .
ఎంట్రీ లెవెల్ Nokia 2 Finnish కంపెనీ HMD Global యొక్క ఆన్ స్క్రీన్ ఆండ్రాయిడ్ నావిగేషన్ బటన్ గల మొదటి డివైస్ అవుతుంది . ఈ ఫోన్ 4000mAh బ్యాటరీ తో వస్తుంది . Nokiapoweruser చెప్తున్న ప్రకారం Nokia 2 సెప్టెంబర్ యొక్క ఆఖరి వారం మరియు అక్టోబర్ మొదటి వారం లో భారత్ లో లాంచ్ చేయబడుతుంది మరియు దీని ధర Rs 7,999.