రూ.1,299 ప్రారంభ ధరతో కొత్త ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసిన నోకియా.!

రూ.1,299 ప్రారంభ ధరతో కొత్త ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసిన నోకియా.!
HIGHLIGHTS

నోకియా బ్రాండ్ నుండి రెండు కొత్త ఫీచర్లు ఫోన్లు ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టాయి

నోకియా ఫీచర్ ఫోన్ల వరుసలోకి మరొక రెండు ఫోన్లు ఇప్పుడు కొత్తగా వచ్చి చేరాయి

Nokia 105 (2023) మరియు Nokia 106 ఫీచర్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి

నోకియా బ్రాండ్ నుండి రెండు కొత్త ఫీచర్లు ఫోన్లు ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టాయి. మన్నికకు మారు పేరుగా గుర్తింపు తెచ్చుకున్న నోకియా ఫీచర్ ఫోన్ల వరుసలోకి మరొక రెండు ఫోన్లు ఇప్పుడు కొత్తగా వచ్చి చేరాయి. అవే, Nokia 105 (2023) మరియు Nokia 106 ఫీచర్ ఫోన్లు. ఈ రెండు ఫీచర్ ఫోన్లు కూడా గట్టి క్వాలిటీ డిజైన్, బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉన్నట్లు  నోకియా తెలిపింది. ఈ లేటెస్ట్ ఫీచర్ ఫోన్ల ధర మరియు ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం. 

Nokia 105 & 106: ధర 

నోకియా 106 (2023) ఫోన్ ను రూ. 1,299 ధరతో నోకియా ప్రకటించింది. Nokia 106(2023) ఫీచర్ ఫోన్ ను రూ. 2,199 ధరతో లాంచ్ చేసింది. ఈ రెండు ఫీచర్ ఫోన్ లు కూడా Nokia ఆన్లైన్ స్టోర్ నుండి సేల్ అవుతున్నాయి. 

Nokia 105 & 106: ఫీచర్లు 

నోకియా 105(2023) మరియు నోకియా 106 రెండు ఫీచర్ ఫోన్లు కూడా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మరియు కీ క్యాడ్ తో వస్తాయి. నోకియా 105 ఫోన్ వైర్లెస్ FM, 2000 కాంటాక్ట్స్ స్టోరేజ్, 500 SMS స్టోరేజ్ వంటి ఫీచర్లతో పాటుగా బిగ్ మరియు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో వస్తుంది. 

అయితే, నోకియా 106 ఫీచర్ ఫోన్ Mciero SD కార్డ్ సపోర్ట్ తో వస్తుంది మరియు బ్లూటూత్ సపోర్ట్ ని కూడా కలిగి ఉంటుంది. అంటే, ఈ ఫోన్ లో వైర్లెస్ FM తో పాటుగా MP3 ప్లేయర్ తో ఆడియో ని కూడా ఎంజాయ్ చెయ్యవచ్చు. 

ఈ రెండు ఫోన్లలో మరొక కొత్త మరియు ఉపయోగకరమైన ఫీచర్ ను కూడా నోకియా అందించింది. ఈ ఫోన్లలో UPI 123PAY ఫీచర్ ను ఇన్ బిల్ట్ గా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo