నోకియా 10 HMD గ్లోబల్ యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ . ఈ ఫోన్ గురించి ఎన్నోలీక్స్ వచ్చాయి . లేటెస్ట్ గా నోకియా10 యొక్క ఒక లీక్ స్కెచ్ బయటకు వచ్చింది దీని ప్రకారం , ఈ స్మార్ట్ ఫోన్ 5 కెమెరా సెటప్ తో వస్తుంది .ఈ ఫోన్ వెనుక భాగంలో 5 వెనుక కెమెరా సెటప్ ఉంటుంది (పంటా లెన్స్ కెమెరాగా కూడా పిలువబడుతుంది). HMD గ్లోబల్ వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ MWC 2018 ఈవెంట్లో కొన్ని ప్రధాన స్మార్ట్ఫోన్లను పరిచయం చేయబోతోంది, వీటిలో నోకియా 10 కూడా ఉండవచ్చు.
ప్రస్తుతానికి నోకియా 10 యొక్క లీక్ డిజైన్ లో ఈ ఫోన్ యొక్క కెమెరా మాత్రమే కనిపిస్తుంది . ఇతర ఫీచర్స్ గురించి సమాచారం వెల్లడి చేయబడింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫోన్ స్నాప్డ్రాగెన్ 845 SoC ప్రాసెసర్ తో వస్తుంది, 18: 9 డిస్ప్లే తో వస్తుంది . ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ పై కెమెరా కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
రిపోర్ట్ ప్రకారం, దీనిలో రొటేటింగ్ పెంటా లెన్స్ కెమెరా సెటప్ వెనుక ప్యానెల్లో ఇవ్వబడుతుంది. ఈ ఫోన్ పెద్ద సర్కులర్ మాడ్యూల్ ని కలిగి ఉంటుంది, ఇది నోకియా లూమియా 1020 వలె ఉంటుంది.స్కెచ్ లో ప్రధాన కెమెరా యూనిట్ ఫోన్ లో డ్యూయల్ కెమెరా లెన్స్ ఉంటుంది మరియు మిగిలిన లెన్స్ మాడ్యూల్ లోపల కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ మరియు ధర గురించి ఏ సమాచారాన్ని వెల్లడించలేదు.
నోకియా స్మార్ట్ఫోన్ ఫ్యాన్స్ మరింత సమాచారం కోసం కొంచెం ఎక్కువ వేచి ఉండాలి , ఎందుకంటే ఈ ఫోన్ ని MWC 2018 ఈవెంట్లో ప్రారంభించకపోతే, అప్పుడు ఈ ఫోన్ బెర్లిన్లో జరిగే IFA 2018 ట్రేడ్ షోలో అందించబడుతుంది.