ఇండియాలో NextBit రాబిన్ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్స్

ఇండియాలో NextBit రాబిన్ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్స్
HIGHLIGHTS

ఇది కంప్లీట్ క్లౌడ్ స్టోరేజ్ కాన్సెప్ట్ తో వస్తున్న మొబైల్

US కంపెని Nextbit అనే కొత్త బ్రాండ్ లో Robin పేరుతో స్మార్ట్ ఫోన్ గురించి గతంలో చెప్పటం జరిగింది. ఇప్పుడు రాబిన్ ఇండియా తో పాటు మరికొన్ని దేశాలలో ప్రీ ఆర్డర్స్ ఇస్తుంది. ధర – 30,400 రూ లకు వస్తుంది షిప్పింగ్ తో కలిపి.

ఫోన్ లో ప్రధాన విషయం, డేటా స్టోరేజ్ అంతా క్లౌడ్ లోనే ఉంటుంది. మొబైల్ లో అండ్ లోకల్ స్టోరేజ్ లలో డేటా లాస్ అవటం అనే ప్రాబ్లెం కోసం ఈ క్లౌడ్ స్టోరేజ్ మొబైల్ ను స్టార్ట్ చేసింది, నెక్స్ట్ బిట్.

స్పెసిఫికేషన్స్ – 5.2 in ఫుల్ HD IPS గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 100gb క్లౌడ్ స్టోరేజ్, 13MP ఆటో ఫోకస్ డ్యూయల్ టోన్ ఫ్లాష్, 5MP ఫ్రంట్ కెమేరా.

స్నాప్ డ్రాగన్ 808 ప్రొసెసర్, 3gb ర్యామ్, 2,690 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్ సపోర్ట్, usb టైప్ C పోర్ట్, డ్యూయల్ ఫ్రంట్ ఫెసింగ్ స్పీకర్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

మీ ఫోన్ wifi అండ్ చార్జింగ్ లో ఉన్నప్పుడు, మీ డేటా అంతా క్లౌడ్ స్టోరేజ్ లోకి బ్యాక్ అవుతుంది. అలానే చాలా అరుదుగా వాడే యాప్స్, ఇమేజెస్ వంటి వాటిని కూడా ఇంటర్నెల్ స్టోరేజ్ నుండి క్లౌడ్ కు మూవ్ చేస్తుంది ఆటో మేటిక్ గా.

ఆపిల్, htc అండ్ అమెజాన్ లో పని చేసిన ఉద్యోగులచే స్టార్ట్ అయిన కొత్త కంపెని ఇది. kickstarter లో కూడా ఇది సూపర్ సక్సెస్ అయ్యింది.

కాని ఇది ఇండియన్ మార్కెట్ లో మాత్రం పూర్ ఇంటర్నెట్ కనెక్టివిటి issuses కారణంగా సక్సెస్ కాకపోవచ్చు. మొబైల్ లుక్స్ మాత్ర్రం ఫ్రెష్ అండ్ కూల్ గా ఉంటాయి.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo