ఈరోజు రిలీజ్ అయిన Tecno POVA 6 Pro 5G ప్రైస్ మరియు టాప్ ఫీచర్లు ఇవే.!
Tecno POVA 6 Pro 5G ఈరోజు లాంఛన ప్రాయంగా ప్రవేశపెట్టబడింది
ఈ ఫోన్ ను డైనమిక్ టెక్ డైజిన్ తో తీసుకు వచ్చింది
టెక్నో పోవా 6 ప్రో 5జి 6000 mAh బ్యాటరీని 70W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.
భారత్ మార్కెట్ లో Tecno POVA 6 Pro 5G ఈరోజు లాంఛన ప్రాయంగా ప్రవేశపెట్టబడింది. భారత మార్కెట్ లో ఈరోజు కొత్తగా విడుదలైనటువంటి ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకర్షణమైన ఫీచర్లు మరియు డిజైన్ తో వచ్చింది. ప్రీమియం ఫోన్లో మాత్రమే కనిపించే నోటిఫికేషన్ ఎల్ఈడీ లైట్లతో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. లేటెస్ట్ టెక్నో స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్లు మరియు ప్రైస్ ఎలా ఉన్నాయో చూద్దామా.
Tecno POVA 6 Pro 5G Price
టెక్నో పోవా 6 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 19,999 రూపాయల ధరలో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ పైన రూ. 2,000 అధనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ టెక్నో లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Tecno POVA 6 Pro 5G టాప్ ఫీచర్స్
Design
ఈ ఫోన్ ను డైనమిక్ టెక్ డైజిన్ తో తీసుకు వచ్చింది. ఇది కేవలం 7.88 మందం చాలా సన్నగా అందంగా కనిపిస్తుంది. ఇందులో వెనుక ఇండివిడువల్ గా పనిచేసే 210 micro-LEDs ని Dynamic-Eye Design తో అందించింది. ఇది నోటిఫికేషన్ లతో వెలుగుతూ చాలా ఆకర్షణీయంగా మారుతుంది.
Display
ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ బిగ్ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD + రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 100% DCI-P3 వైడ్ కలర్ గ్యామూట్ కలిగిన 10 Bit స్క్రీన్. అంతేకాదు, ఈ స్క్రీన్ పైన ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా వుంది.
Processor & RAM
టెక్నోఈ ఫోన్ ను MediaTek Dimensity 6080 5G బడ్జెట్ గేమింగ్ ప్రోసెసర్ తో తీసుకు వచ్చింది. ఈ ప్రోసెసర్ కి జతగా 12 GB ఫిజికల్ RAM మరియు 12GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ తో కలిపి టోటల్ 24 GB ర్యామ్ ఫీచర్ ను అందిస్తుంది.
Also Read: TWS Buds Offer: చౌక ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.!
Storage
ఈ ఫోన్ లో 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందించింది.
Camera
ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ 108MP Ultra Vivid ట్రిపుల్ రియర్ కెమేరా మరియు ముందు 32MP Ultra-Clear సెల్ఫీ కెమేరా వుంది.
Battery & charge Tech
టెక్నో పోవా 6 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ పెద్ద 6000 mAh బ్యాటరీని 70W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.
Other Features
ఈ ఫోన్ లో Dolby Atmos మరియు Hi-Res Audio సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో IR బ్లాస్టర్, గేమ్ స్పేస్ 4.0 ఫీచర్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.