తాజా రిపోర్ట్స్ ప్రకారం నెక్స్ట్ నెక్సాస్ స్మార్ట్ ఫోన్ ను LG ఆక్టోబర్ నెలలో రిలీజ్ చేయనుంది. ఈ సంవత్సరం దీనితో పాటు మరొక నెక్సాస్ ఫోన్ కూడా లాంచ్ అవనుంది. ఒకటి LG నుండి తయారు కాగా, రెండవది Huawei నుండి రానుంది.
సౌత్ కొరియన్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం LG నెక్స్ట్ నెక్సాస్ ఫోన్ లో 3D టెక్నాలజీ మరియు రెండు కెమేరా మాడ్యుల్స్ ఇన్ఫ్రా రెడ్ సెన్సార్ తో రానున్నాయి. దీనిలో 3D బేస్డ్ గ్రాఫిక్స్ మరియు Easy-to-use యూజర్ ఇంటర్ఫేస్ లు ప్రత్యేకంగా ఉండనున్నాయి. 2011లోనే LG డ్యూయల్ కెమేరా టెక్నాలజీని ఆప్టిమాస్ 3D స్మార్ట్ ఫోన్ లో లాంచ్ చేసింది. గూగల్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ M ఇందులో ఉంటుంది.
LG Nexus నెక్స్ట్ మోడల్ యొక్క కొన్ని లిక్డ్ స్పెసిఫికేషన్స్ – 5.2 in డిస్ప్లే, HexaCore క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 808 ప్రోసెసర్, 2700 mah బ్యాటరీ, ఇంబిల్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ . అయితే Huawei తయారు చేయనున్న రెండవ నెక్సాస్ 5.7 in డిస్ప్లే తో టాబ్లెట్ గా రానుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 810 ప్రోసెసర్ మరియు 3500 mah బ్యాటరీ ఇందులో ఉండనున్నాయని రిపోర్ట్స్.
ఆధారం: G for Games