Moto G వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్
2GB ర్యామ్, IPX7 సర్టిఫికేట్
మోటోరోలా జులై 28 న ఇండియాలో మరియు అంతర్జాతీయంగా ఈవెంట్ చేస్తుంది. ఈ ఈవెంట్ లో మోటో G(2015) మోడల్ ను ఇండియాలో అలాగే మోటో X(2015) మోడల్ ను US లో రిలీజ్ చేయనుంది.
తాజాగా ఈ మోటో G అప్ కమింగ్ మోడల్ యొక్క ఇమేజెస్ మళ్ళీ ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. పిక్చర్స్ ప్రకారం ఇది IPX7 సర్టిఫికేషన్ తో వస్తుంది. అంటే వాటర్ ప్రూఫ్ మోడల్. కంపెని గతంలో పంపిన ఇన్విటేషన్ లో కూడా రెయిన్ లో డాన్స్ చేయటానికి రెడీ అవ్వండి అని హింట్ ప్రోమోటింగ్ చేసింది. రూమర్స్ ప్రకారం మోటో X కూడా rugged స్మార్ట్ ఫోన్ గా రానుంది ఈ సారి.
చైనా నుండి shipment అయిన డేటా తో మోటో G మోడల్ నంబర్ XT1550 Zauba సైటులో ప్రత్యేక్షం అయ్యింది. సైటు చెప్పిన దాని ప్రకారం మోటో G 2015 స్మార్ట్ ఫోన్ లో ఈ సారి 2GB ర్యామ్ ఉండనుంది. అలాగే 8GB ఇంబిల్ట్ స్టోరేజ్ కూడా. దీనితో పాటు 16GB వేరియంట్ కూడా ఉంటుంది అని అనుకుంటున్నాం. రేర్ కెమేరా కూడా 13MP కెమేరా సెన్సార్ మరియు ఫ్రంట్ 5MP కెమేరా సెన్సార్ మరియు 4g ఉండనుంది అని రూమర్స్.
ఆధారం: Mobilesyrup
Digit NewsDesk
Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile