ఇంటర్నెట్ లో ఆండ్రాయిడ్ నోకియా స్మార్ట్ ఫోనులు అంటూ రెండు కొత్త leaks(పైన ఉన్నది ఒక ఫోన్ మోడల్, క్రింద ఉన్నది మరొక మోడల్) బాగా హాల్ చల్ చేస్తున్నాయి. Gizmochina రిపోర్ట్స్ ప్రకరం ఇవి కంపెని ఫ్లాగ్ షిప్ క్లాస్ ఫోనులు.
అయితే చూడటానికి ఇవి polycarbonate బాడీ తో వస్తున్నాయి. ఇదే డిజైన్ నోకియ N1 టాబ్లెట్ లో కనిపించింది. ప్రస్తుతం నోకియా HMD Global అనే కంపెని తో tie అప్ అయ్యి ఫోనులను తయారు చేస్తుంది.
ఈ రెండింటికీ 10 ఇయర్స్ ఉంటుంది License, అంటే డిజైన్ అండ్ కాన్సెప్ట్ విషయాలలో నోకియా పని ఉంటుంది, కాని తయారీ లో HMD మాత్రమే పని చేస్తుంది.
ఈ రెండు ఫోనుల్లో 5.2 in అండ్ 5.5 in OLED డిస్ప్లే లు QHD రిసల్యుషణ్ తో ఉంటాయి. ఇంకా.. స్నాప్ డ్రాగన్ 820 SoC, నోకియా Z లాంచర్, ఆండ్రాయిడ్ Nougat (ఆండ్రాయిడ్ అప్ కమింగ్ వెర్షన్, N), 22.6MP రేర్ కెమెరా, IP68 సర్టిఫికేషన్ తో ఫోన్ ప్రైస్ 30,000 ఉంటుంది అని అంచనా. స్పెక్స్ అన్నీ కేవలం రిపోర్ట్స్ మాత్రమే, అఫీషియల్ కాదు.