అక్టోబరు 3 వ తేదీన న్యూయార్క్ లో విడుదల, కానున్న ఈ సామ్రాట్ ఫోన్ చుట్టూ చాలానే లీక్స్ , ముందస్తు అంచనాలు మరియు పుకార్లు చుట్టుముడుతున్నాయి. కంపెనీ ఇప్పటికే ఇందులో వెనుక ప్యానెల్లో మూడు కెమేరాలను ఇవ్వనున్నట్లు ఒక వీడియో ద్వారా టీజ్ చేసింది. అయితే, ఇప్పుడు దీనికి బలం చేకూర్చేలా ప్రముఖ లేకేస్టర్ ఇవాన్ బ్లాస్ చేత ట్విట్టర్ లో పోస్ట్ చేయబడిన ఒక కొత్త చిత్రం ద్వారా గమనించవచ్చు. LG V40 ThinkQ యొక్క ఈ ఆరోపిత చిత్రం, ఫోన్ వెనుక భాగంలో క్షితిజ సమాంతరంగా (అడ్డంగా) అమర్చిన మూడు కెమేరాలు మరియు ముందు రెండు కెమేరాలను చూడవచ్చు. దీని ద్వారా 5 కెమేరాలతో ఒక ఫోన్ రానున్నదని పుకార్లకు బలంచేకూరింది.
https://twitter.com/evleaks/status/1044859693024206848?ref_src=twsrc%5Etfw
లీకైన ఈ చిత్రం, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క రెండు అంచులలో మొత్తం నాలుగు బటన్లను చూపిస్తుంది. వీటిలో రెండు వాల్యూమ్ బాటన్లుగా తెలుస్తుంది, మరొకటి పవర్ బటన్ అయ్యే అవకాశముంది, ఇంకా నాల్గవ బటన్ విషయానికి వస్తే ఇది AI – కి శక్తినిచ్చే వర్చువల్ అసిస్టెంట్, గూగుల్ అసిస్టెంట్ కావచ్చు(అంచనా మాత్రమే). LG కంపెనీ దక్షిణ కొరియా అధికారక వెబ్ పేజీలో పంచుకొన్న ట్రిపుల్ రియర్ కెమేరా ప్రకారం : ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్ తో ఉంటుంది, మరొకటి జూమ్ సామర్ధ్యంతో(టెలీఫోటో లెన్స్) వస్తుంది మరియు మూడవది పోర్ట్రయిట్ చిత్రాలని తియ్యడానికి అంకితమయ్యేదిగా ఉంటుంది. మరోప్రక్క వీడియోలో, ఈ స్మార్ట్ ఫోన్ న్యూయార్క్ లోని కార్యక్రమం తరువాత దీనిని అక్టోబరు 4 న స్వదేశంలో విడుదల చేయబడుతుందని, ఈ దక్షణ కొరియా దిగ్గజం తెలిపింది.