స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఇష్యూస్ సాల్వ్ చేసేందుకు కొత్త డిస్ప్లే టెక్నాలజీ

Updated on 24-Nov-2015

Bolde టెక్నాలజీస్ కొత్తగా బ్యాటరీ ఆదా చేసే డిస్ప్లే ను కనుగోనటం జరిగింది. ఇది స్మార్ట్ ఫోన్ డిస్ప్లే ను రన్ చేయటానికి అవసరం అయ్యే పవర్ ను reduce చేయగలిగే మెటేరియల్ తో తయారు అయ్యింది.

అంటే తక్కువ ఎనేర్జీ తోనే డిస్ప్లే పని చేసే విధంగా. ఎలెక్ట్రికల్ పల్స్ లను వాడి ఆల్మోస్ట్ పవర్ అవసరం లేకుండానే డిస్ప్లే లను రన్ చేయగలదు.

ప్రస్తుతం ఉన్న డిస్ప్లే ల కన్నా ఇవి కలర్ ఫుల్ గా ఉంటాయి. అలాగే సన్ లైట్ లో కూడా చాలా క్లియర్ గా చూపిస్తుంది డిస్ప్లే పై ఉన్న కంటెంట్ ను.

అంతే కాదు తక్కువ ఎనేర్జీ ను తీసుకోవటం వలన స్మార్ట్ ఫోన్స్ లో ఉండే బ్యాటరీ ప్రాబ్లెం కూడా చాలా ఎఫెక్టివ్ గా సాల్వ్ అవుతుంది అని రిపోర్ట్స్.

దీని డెవలప్మెంట్ కోసం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఫండింగ్ అందుతుంది bolde టెక్నాలజీ స్ కు. కంపెని మార్కెట్ లోకి రావటానికి ఆల్రెడీ కన్సుమర్ ఎలెక్ట్రానిక్ కంపెనీలతో మంతనాలు కూడా జరుపుతుంది.

కంపెని ఫౌండర్ Peiman వీటి వలన చార్జింగ్ ప్రోసెస్ అనేది ప్రతీ రాత్రి చేసుకునే పద్దతి నుండి ప్రతీ వారానికి షిఫ్ట్ అవుతుంది అని చెబుతున్నారు. ఇది కేవలం స్మార్ట్ ఫోన్స్ కు మాత్రమే కాదు ప్రతీ ఎలెక్ట్రానిక్స్ కు వాడితే 20 శాతం ఎనేర్జి కాస్ట్ కూడా సేవ్ అవుతుంది అన్నారు.

ఆధారం : ది టెలీగ్రాఫ్

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :