మొబైల్ టెక్నాలజీ లో ఎన్ని ఆధునికమైన స్పెక్స్, మార్పులు వస్తున్నా. బ్యాటరీ విషయంలో మాత్రం కేవలం mah పవర్ పెరుగుతుంది కాని బ్యాటరి టెక్నాలజీ మారటం లేదు.
ఇప్పటికీ అడపా దడపా కొన్ని టెక్నాలజీలు దీనిపై పనిచేస్తున్నట్లు వింటున్నాము కాని ఇవేమీ పూర్తిగా వినియోగదారుల వద్దకు చేరుకోవటం లో విఫలమవుతున్నాయి.
అయితే మరి ఇప్పుడు లేటెస్ట్ గా మరొక టెక్నాలజీ వచ్చింది. US బేస్డ్ అయిన SolidEnergy అనే కంపెని ప్రస్తుత Lithium ion బ్యాటరీస్ కన్నా డబుల్ బ్యాక్ అప్ ఇచ్చే కొత్త బ్యాటరీ తయారు చేసింది.
ఇందులో సరి కొత్త లిథియం మెటల్ టెక్నాలజీ వాడింది కంపెని. ఇందువలన ions రెండు రెట్లు ఎక్కువ సేపు ఉండగలవు. ఈ ions ఏ బ్యాటరీ లో చార్జింగ్ ను hold చేసేవి.
సీఈఓ Qichao మాట్లాడుతూ ప్రస్తుత బ్యాటరీ సైజ్ లోనే డబుల్ బ్యాక్ అప్ ఇచ్చే బ్యాటరీస్ ను తయారు చేయగలం మరియు ప్రస్తుత బ్యాటరీ సైజ్ కన్నా సగం సైజ్ లో అదే బ్యాక్ అప్ ను అందించగలం అని అన్నారు.
సరే అసలు విషయానికి వద్దాము.. ఇది కూడా న్యూస్ వరకే పరితమవుతుందా? దీనికి ఎవ్వరూ జవాబు చెప్పలేరు ప్రస్తుతం. కాని కంపెని మాత్రం 2017 నాటికి కొత్త బ్యాటరీ టెక్నాలజీ ను స్మార్ట్ ఫోనులు, స్మార్ట్ వాచెస్ లో తెచ్చే ప్లాన్స్ లో ఉన్నట్లు చెబుతుంది.
మరొక విషయం.. దీనిలో non-flammable లిక్విడ్స్ వాడి Li-on బ్యాటరిస్ కన్నా safe గా ఉండేలా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. ప్రస్తుత Lion బ్యాటరీస్ పైన ఉండే బాడి నుండి బయటకు వచ్చి ఆక్సిజెన్ కు తగిలితే పేలుతాయి.