రింగింగ్ బెల్స్ కంపెని తరువాత Docoss అనే కంపెని కూడా ఇండియాలో చీప్ గా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయటానికి వస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
ఇప్పుడు లేటెస్ట్ గా నిన్న Namotel Acche Din అనే పేరుతో మరొక కంపెని/ఫోన్ 99 రూ లకు వస్తుంది అని అనౌన్స్ అయ్యింది ఇండియాలో.
4 in డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1GB ర్యామ్, 2MP రేర్ అండ్ 0.3MP ఫ్రంట్ కేమేరాస్, ఆండ్రాయిడ్ లాలిపాప్, 1325 mah బ్యాటరీ, 4GB ఇంబిల్ట్ స్టోరేజ్ తో వస్తుంది.
ఇది May 17 నుండి May 25 వరకు కంపెని వెబ్ సైట్ (namotel.com) లో ప్రీ బుకింగ్స్ ను నిర్వహిస్తుంది. కాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది కాని డెలివరీ చార్జెస్ వర్తిసాయి.
ఇది make in india భాగంలో వస్తున్న ఫోన్ అని చెబుతుంది కంపెని. ఆధార్ కార్డ్ ఉన్న ఇండియన్స్ మాత్రమే ఈ ఫోన్ కొనగలరు అని కూడా చెబుతుంది.
Docoss X1 పేరుతో 888 రూ లకు 1.2GHz డ్యూయల్ కోర్ SoC, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ తప్ప మిగిలిన సేమ్ ఫీచర్స్ తో గత నెలలో అనౌన్స్ అయ్యింది. May 2 నుండి షిప్పింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపింది.
మరో వైపు రింగింగ్ బెల్స్ ఫ్రీడం 251 కూడా 251 రూ లకు సేమ్ ఫీచర్స్ తో అనౌన్స్ అయ్యింది. అయితే ఇండియాలో సడెన్ గా ఇటువంటి ఎందుకు మొదాలవుతున్నాయి , ఎంత వరకూ వెళ్తున్నాయి అనే సమాధానాలు మాత్రం కనపడటం లేదు. ఏదైతేనేమి users కూడా అంత ఈజీగా వీటిని తీసుకోని ఆలోచనలలో కూడా లేరు.