ఇకపై మోజిల్ల్లా తన సొంత ఓస్ తో హైబ్రిడ్ ఫోన్లను దించనుంది..

ఇకపై మోజిల్ల్లా తన సొంత ఓస్ తో హైబ్రిడ్ ఫోన్లను దించనుంది..
HIGHLIGHTS

మొజిల్లా పెర్ఫార్మెన్స్ ఒరిఎంటేడ్ స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తుంది. తక్కువ ధరల ఫోనులను ఆపేస్తారు.

మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ పోయిన సంవత్సరం  మొజిల్లా పేరు మీద దాని సొంత మొబైల్ ఓస్ ను తయారుచేసిన విషయం మీకు తెలుసు. అయితే దాని సొంత ఓస్ తో చాలా తక్కువ బడ్జెట్ లో Intex cloud FX  లాంటి మోడల్స్ కొన్ని తయారు చేసింది మొజిల్లా. అయితే అవి ఊహించినంత మార్కెట్ ను తీసుకురాలేదు. అంతకు మించి ఫైర్ ఫాక్స్ ఓస్ ప్లాట్ఫారం లో అప్లికేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కొంతమందికి అయితే మొజిల్లా ఫోనులు ఉన్నాయని కూడా తెలియదు. దాని దృష్టిలోకి పరిగణించి మొజిల్లా ఇప్పుడు హై ఎండ్ పెర్ఫార్మెన్స్ ఒరిఎంటేడ్ స్మార్ట్ ఫోన్లను తయారు చేసేందుకు సన్నిదమవుతుంది. 

                                               

CNET సమాచార సంస్థకు ఇదే విషయం పై మెయిల్ పంపింది. వినియోగదారులు కేవలం తక్కువుగా వస్తుంది అని కాకుండా మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉందని తమ ఫోన్లను వాడే విధంగా మొబైల్స్ ను తయారు చేస్తాము అని మెయిల్ లో చెప్పింది. మంచి హార్డ్వేర్ మరియు ఆధునిక ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ల కే ఇప్పుడు మార్కెట్ ఉందని లేటుగా గ్రహించింది మొజిల్లా సంస్థ.

గూగల్ ఆండ్రాయిడ్ మాదిరిగానే మొజిల్లా తమ ఓస్ సోర్స్ కోడ్ ను డెవెలపర్స్ కొరకు అందుబాటులో ఉంచనుంది. మొబైల్స్ తో పాటు స,స్మార్ట్ టివి లకు కూడా మార్కెట్ ను విస్తరించనుంది మొజిల్లా.

ఆధారం: CNET

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo