మోటరోలా వన్ పవర్ Vs నోకియా 6.1 ప్లస్ : ప్రత్యేకతల పోలిక

Updated on 02-Oct-2018
HIGHLIGHTS

ఈరోజు మనము నోకియా 6.1 ప్లస్ తో మోటరోలా వన్ పవర్ ని సరిపోల్చనున్నాము, ఈ రెండు కూడా Android One కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి, కానీ ఇవి మీ డబ్బు కోసం ఉత్తమ విలువను అందిస్తుందా? చూద్దాం రండి.

Motorola ఎట్టకేలకు  భారతదేశం లో ఒక Android One స్మార్ట్ఫోన్ ప్రకటించింది. మోటరోలా వన్ పవర్ గా అందించిన ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ వన్ తో వస్తుంది. ఇది ప్రస్తుతం Flipkart లో రూ .15,999 ధరతో ఉంది. ఈ మోటరోలా వన్ పవర్ స్మార్ట్ ఫోన్ మోటరోలా నుండి వచ్చిన మొట్టమొదటి  నోచ్ గల స్మార్ట్ఫోన్గా ఉంది, ఇది డిస్ప్లే ఎగువ భాగంలో ఒక నోచ్ తో ఉంటుంది. కొత్త ఫోన్ కి అతి పెద్ద పోటీదారులలో ఒకరైన నోకియా 6.1 ప్లస్, కూడా  Android One కార్యక్రమంలో భాగంగా ఉంది మరియు వన్ పవర్ వంటి చాలా సారూప్య లక్షణాలను కలిగి ఉంది. కాబట్టి ఈ రెండు పరికరాలను పోల్చి చూడాల్సిన వాటిని ఇప్పుడు చూద్దాం.

Products

Motorola One Power

Nokia 6.1 Plus

Launch price

Rs 15,999

Rs 15,999

Display

6.20-inch

5.8-inch

Resolution

1080 x 2246

1080 x 2280

Processor make

Qualcomm

Snapdragon 636

Qualcomm Snapdragon 636

Processor

1.8GHz octa-core

1.8GHz octa-core

RAM

4GB

4GB

Internal storage

64GB

64GB

Expandable storage

256GB

400GB

Rear camera

16MP + 5MP

16MP + 5MP

Rear Flash

Yes

Yes

Front camera

12MP

16MP

Android version

8.0 Oreo

8.1 Oreo

వీటి కెమెరాలకి విషయానికి వస్తే, ఈ రెండు పరికరాలలో వెనుకభాగంలో 16MP + 5MP డ్యూయల్ – కెమెరా సెటప్ ఉంటుంది. అయితే, మీరు సెల్ఫీ కెమెరాని ఎక్కువగా ఇష్టపడే వారైతే, అప్పుడు నోకియా 6.1 ప్లస్  మీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే, నోకియా 6.1 ప్లస్ ముందు 16MP కెమెరా యూనిట్ తో వస్తుంది, అయితే మోటరోలా వన్ పవర్ 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.ఈ రెండు పరికరాల డిస్ప్లే లను పోల్చిస్తే : నోకియా 6.1 ప్లస్ కంటే మోరోలా వన్ పవర్ ఒక పెద్ద డిస్ప్లే ను కలిగి ఉంది, ఇది ఒక 6.2 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో  నోకియా 6.1 ప్లస్ యొక్క 5.8 అంగుళాల డిస్ప్లేతో కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. కాబట్టి, మీరు మీ స్మార్ట్ఫోన్లో వీడియోలు మరియు సినిమాలు చాలా విరివిగా చూసేవారైతే, అప్పుడు మోటరోలా వన్ పవర్ మీరు ఎదురుచూసే  పరికరం కావచ్చు. వీటి పనితీరుకి వచ్చినప్పుడు, ఈ రెండు పరికరాలు కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ తో వస్తాయి మరియు ఇవి 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీని కలిగి ఉంటాయి.

మోటరోలా వన్ పవర్ మరియు నోకియా 6.1 ప్లస్ రెండూ కూడా, గూగుల్ యొక్క Android One  కార్యక్రమంలో భాగంగా ఉన్నాయని గుర్తుంచుకోండి, అనగా ఈ రెండు ఫోన్లు గూగుల్ అప్డేట్ విడుదల చేసిన వెంటనే వాటిని పొందడానికి సిద్ధంగా ఉండే  మొట్టమొదటి పరికరాల్లో ఒకటిగా ఉంటాయి. మోటరోలా వన్ పవర్ మరియు  నోకియా 6.1 ప్లస్ కూడా రూ .15,999 ఒకే  ధరలో అందుబాటులో ఉంటాయి (ఫ్లిప్ కార్ట్లో).

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :