చైనీస్ టెక్ giant, లెనోవో.. మోటోరోలా కంపెని ను గూగల్ నుండి 2014 లో కొనటం జరిగింది. అప్పటి నుండి లెనోవో ఒక బ్రాండ్ నేమ్ క్రిందనే unify చేస్తుంది రెండు బిజినెస్ లను.
సో ఇక నుండి లెనోవో మోటోరోలా పేరును తీసేసి "moto by lenovo" అనే పేరును పెట్టింది. లెనోవో తయారు చేసే హై ఎండ్ బడ్జెట్ మోడల్స్ అన్నీ moto సబ్ బ్రాండింగ్ లో వస్తాయి ఫ్యూచర్ లో.
Low ఎండ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అన్నీ సబ్ Vibe బ్రాండింగ్ లో రానున్నాయి. మోటోరోలా ను గూగల్ 2011 లో కొనటం జరిగింది. 2013 లో వచ్చిన మోటో X తరువాత మరే ఇతర ప్రోడక్ట్ మీద moto బ్రాండ్ నేమింగ్ లేదు.
ఇక మోటోరోలా అనే పేరు వినపడదు కాని మోటో X, G సిరిస్ ఫోనులు మాత్రం వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా కూడా మోటో G టర్బో, X స్టైల్ అని కొత్తగా డిఫరెంట్ మోడల్స్ ను రిలీజ్ చేసింది లెనోవో మోటో. అంటే మోటోరోలా ను పూర్తిగా ఆపేయటం లేదు లెనోవో, కేవలం రోలా తీస్తుంది అంతే!