Motorola Razr 50: స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన మోటోరోలా.!
Motorola Razr 50 లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ యొక్క టాప్ ఫీచర్స్ ని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది
ఈ ఫోన్ యొక్క మరిన్ని వివరాలను త్వరలోనే అందిస్తుందని కూడా తెలిపింది
Motorola Razr 50 స్మార్ట్ ఫోన్ గురించి నిన్నటి వరకూ కేవలం ఫీచర్స్ మరియు కమింగ్ సూన్ పేరుతో మాత్రమే టీజింగ్ చేసిన మోటోరోలా ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. మోటోరోలా రేజర్ 50 స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 9 వ తేదీ ఇండియాలో విడుదల చేస్తుందని డేట్ అనౌన్స్ చేసింది.ఈ ఫోన్ యొక్క టాప్ ఫీచర్స్ ని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది మరియు ఈ ఫోన్ యొక్క మరిన్ని వివరాలను త్వరలోనే అందిస్తుందని కూడా తెలిపింది.
Motorola Razr 50: ఫీచర్స్
మోటోరోలా రేజర్ 50 స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో పెద్ద 3.6 ఇంచ్ బయట స్క్రీన్ ను కలిగిన ఫోన్ గా నిలుస్తుందని మోటోరోలా ప్రకటించింది. ఈ ఫోన్ ను IPX8 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగిన వేగాన్ లెథర్ ఫినిష్ తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ గొప్ప పాకెట్ డిజైన్ మరియు కొత్త Desk Mode తో వస్తుంది.
ఈ ఫోన్ బయట స్క్రీన్ గురించి కంపెనీ పూర్తి వివరాలు అందించింది. ఈ ఫోన్ బయట స్క్రీన్ 1700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% DCI P3, SGS ఐ ప్రొటెక్షన్ మరియు పటిష్టమైన గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ తో ఉంటుందని మోటోరోలా తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ బయట స్క్రీన్ ఫుల్ ఫంక్షనల్ గా కూడా ఉంటుంది.
మోటోరోలా రేజర్ 50 స్మార్ట్ ఫోన్ 4,00,00 ఫోల్డ్స్ వరకు తట్టుకుంటుంది అని మోటోరోలా సర్టిఫై చేస్తోంది. ఈ సెగ్మెంట్ లో Gemini తో వచ్చే ఏకైక ఫోన్ అవుతుందని కూడా చెబుతోంది. ఈ ఫ్లిప్ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది మరియు ముందు సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.
Also Read: Realme Narzo 70 Turbo పవర్ ఫుల్ ఫీచర్స్ మరియు చూడచక్కని డిజైన్ తో వస్తోంది.!
ఈ ఫోన్ లో ఉన్న రియర్ కెమెరాతో గొప్ప ఫోటోలు పొందవచ్చని కూడా మోటోరోలా టీజర్ పేజ్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ చూడటానికి చాలా స్లీక్ గా వుంది మరియు పటిష్టమైన హింజ్ తో వస్తుంది.