Motorola Razr 50 Ultra పెద్ద ఔటర్ డిస్ప్లేతో లాంచ్ అవుతోంది.!
Motorola Razr 50 Ultra లాంచ్ డేట్ ను మోటోరోలా అనౌన్స్ చేసింది
Moto AI సపోర్ట్ తో పాటుగా 4 ఇంచ్ LTPO పెద్ద ఔటర్ డిస్ప్లేతో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది
మోటోరోలా రేజర్ 50 సిరీస్ నుంచి 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను జబర్దస్త్ ఫీచర్లతో విడుదల చేస్తోంది
Motorola Razr 50 Ultra ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను Moto AI సపోర్ట్ తో పాటుగా 4 ఇంచ్ LTPO పెద్ద ఔటర్ డిస్ప్లేతో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మోటోరోలా రేజర్ 40 సిరీస్ నుండి మరింత అప్గ్రేడ్ లను ఈ అప్ కమింగ్ ఫ్లిప్ ఫోన్ నుండి చూడవచ్చు. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటుగా, ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా మోటోరోలా ప్రకటించింది.
Motorola Razr 50 Ultra Launch
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను జూలై 4వ తేదీన ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్స్ కూడా ప్రారంభమవుతాయని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.
Motorola Razr 50 Ultra: ఫీచర్లు
మోటోరోలా రేజర్ 50 సిరీస్ నుంచి 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను జబర్దస్త్ ఫీచర్లతో విడుదల చేస్తోంది. ఈ ఫోన్ ను moto ai సపోర్ట్ తో అందిస్తోంది. ఈ ఫోన్ లో అందించిన కెమెరా కూడా కొత్త మోటో ai సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్ 50MP టెలీ కెమెరా ఉన్నాయి. ఇందులో అనేకమైన ఫిల్టర్స్, ఫీచర్స్ మరియు AI సపోర్ట్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్ సెట్ జతగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 512 GB UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ లతో వస్తుంది. ఈ మోటోరోలా ఫ్లిప్ ఫోన్ 4000mAh బ్యాటరీని 45W టర్బో పవర్ ఛార్జింగ్ మరియు 15W వైర్లెస్ చరింగ్ మరియు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.
Also Read: సిల్వర్ జూబ్లీ కానుకగా Nokia 3210 ను కొత్త టచ్ తో రీ లాంచ్ చేసిన HMD
ఈ ఫోన్ లో 4 ఇంచ్ LTPO పెద్ద అవుటర్ డిస్ప్లే వుంది. ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఈ ఫోన్ టియర్ డ్రాప్ హింజ్ మరియు IPx8 రేటింగ్ అండర్ వాటర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ ను స్ప్రింగ్ గ్రీన్, మిడ్ నైట్ బ్లూ మరియు పీచ్ ఫజ్ అనే మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుంది.