digit zero1 awards

Motorola Razr 50 Ultra: కొత్త ఫ్లిప్ ఫోన్ ను Gemini Ai సపోర్ట్ తో విడుదల చేసిన మోటోరోలా.!

Motorola Razr 50 Ultra: కొత్త ఫ్లిప్ ఫోన్ ను Gemini Ai సపోర్ట్ తో విడుదల చేసిన మోటోరోలా.!
HIGHLIGHTS

Motorola Razr 50 Ultra ను ఈరోజు విడుదల చేసింది

ఈ ఫోన్ అవుట్ సైడ్ లో 4 ఇంచ్ LTPO స్క్రీన్ వుంది

ఈ ఫోన్ లోపల మోటో AI ఇంటెలిజెన్స్ ను కూడా కలిగివుంది

Motorola Razr 50 Ultra: ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రీమియం రేటుతో ఈరోజు విడుదల చేసింది. ఈ ఫోన్ అవుట్ సైడ్ లో 4 ఇంచ్ LTPO స్క్రీన్ వుంది మరియు ఈ ఫోన్ లోపల మోటో AI ఇంటెలిజెన్స్ ను కూడా కలిగివుంది. ఇలా చెప్పుకుంటే పోతే ఈ ఫోన్ లో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఫీచర్స్ మాత్రమే ప్రీమియం కాదండోయ్, ఈ ఫోన్ ధర కూడా ప్రీమియం గానే వుంది.

Motorola Razr 50 Ultra: ప్రైస్

ముందుగా ఈ ఫోన్ ప్రైస్ వివరాల్లోకి వెళితే, ఈ ఫ్లిప్ ఫోన్ ను రూ. 99,999 రేటుతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం సింగల్ వేరియంట్ లో మాత్రమే విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ తో జతగా చాలా గొప్ప ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా మరియు మోటో అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అవుతుంది.

ఆఫర్లు:

Motorola Razr 50 Ultra
Motorola Razr 50 Ultra

ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 9,999 రూపాయల విలువైన Moto Buds ను ఉచితంగా అందిస్తుందట, అది కూడా బాక్స్ తో పాటు బడ్స్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన అధిక ప్రయోజనాలు అందించే బ్యాంక్ ఆఫర్లు కూడా జత చేసింది. ఈ ఫోన్ ను ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ కొనేవారికి 10% సేవింగ్ అందుతుంది.

Also Read: OnePlus బిగ్ Smart Tv పైన అమెజాన్ ధమాకా ఆఫర్.. డోంట్ మిస్ ది డీల్.!

Motorola Razr 50 Ultra: ఫీచర్లు

మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఫ్లిప్ ఫోన్ ను Snapdragon 8s Gen 3 ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించింది. ఇది అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ లో బయట 4 ఇంచ్ LTPO డిస్ప్లేని 165Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో 6.9 ఇంచ్ ఫోల్డబుల్ LTPO మెయిన్ డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే Dolby Vision మరియు HDR 10 సపోర్ట్ లను కలిగి వుంది.

Motorola Razr 50 Ultra
Motorola Razr 50 Ultra

ఈ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా మరియు 50MP టెలీ ఫోటో సెన్సార్ లతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో 4000 mAh బ్యాటరీ వుంది మరియు ఇది 45W ఫాస్ట్ ఛార్జ్, 15W వైర్లెస్ ఛార్జ్ మరియు 5W రివర్స్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ లతో వస్తుంది. ఈ కొత్త ఫ్లిప్ ఫోన్ ను Gemini Ai సపోర్ట్ తో మోటోరోలా విడుదల చేసింది. మోటో AI సపోర్ట్ తో స్మార్ట్ ఫోన్ కెమెరాతో అద్భుతమైన ఫోటోలు మరియు ఫీచర్లను అందుకోవచ్చని మోటోరోలా తెలియ చేసింది.

ఈ ఫోన్ లో Dolby Atmos మరియు Hi-Res ఆడియో సపోర్ట్ వుంది. ఈ ఫోన్ బాక్స్ లో వచ్చే మోటో పవర్ ఫుల్ బడ్స్ మోటో బడ్స్ ప్లస్ తో ఈ ఫోన్ అద్భుతమైన ఆడియో ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo