Motorola Razr 50 రీడిజైన్ హింజ్ మరియు బిగ్ డిస్ప్లేతో వస్తోంది.!
Motorola Razr 50 స్మార్ట్ ఫోన్ లాంచ్ ను మోటోరోలా అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ ఫోన్ ప్రత్యేకతలు మరియు డిజైన్ తో లాంచ్ అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ డిజైన్ ఆకట్టుకుంటోంది
Motorola Razr 50 స్మార్ట్ ఫోన్ లాంచ్ ను మోటోరోలా అనౌన్స్ చేసింది. మోటోరోలా రీసెంట్ గా తీసుకు వచ్చిన మోటోరోలా రేజర్ 40 ఫోన్ కి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా దీన్ని తీసుకు వస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు మరియు డిజైన్ తో మోటోరోలా ఈ ఫోన్ లాంచ్ ను అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ డిజైన్ ఆకట్టుకుంటోంది.
Motorola Razr 50 : లాంచ్
ఈ మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ అవుతుంది అని మాత్రం మోటోరోలా తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క ప్రధాన ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా వెల్లడిస్తూ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ అధికారిక x అకౌంట్ నుంచి టీజింగ్ చేస్తోంది.
మోటోరోలా రేజర్ 50 స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని అందించి టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ నుంచి ఈ ఫోన్ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ ఫీచర్స్ తెలుస్తున్నాయి.
Motorola Razr 50 : ఫీచర్స్
మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రేజర్ 50 స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ చాలా స్లీక్ గా కనిపిస్తోంది. రేజర్ 50 ఫోన్ ను రీడిజైన్ హింజ్ మరియు అల్టిమేట్లీ డ్యూరబుల్ డిజైన్ తో వస్తుందని మోటోరోలా చెబుతోంది. ఈ ఫోన్ ను పెద్ద అవుటర్ డిస్ప్లే తో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ ఇమేజ్ ల ద్వారా క్లియర్ అవుతోంది.
Also Read: చవక ధరలో తన మొదటి TWS బడ్స్ ను ANC తో లాంచ్ చేసిన iQOO.!
రేజర్ 50 స్మార్ట్ ఫోన్ ను రెండు గొప్ప కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో గ్రే మరియు ఆరెంజ్ కలర్ ఆప్షన్ లలో అందంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా మరియు ఫ్లాష్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో టైప్ C ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.