మోటోరోలా ఫోన్స్ లాంచ్ : మోటో జెడ్3 మరియు ఆండ్రాయిడ్ వన్ తో పనిచేసే మోటో వన్ పవర్ మరియు మోటో వన్ ఈ రోజు విడుదల కానున్నాయి
మోటో జెడ్3 విడుదల తరువాత మోటో 5జి మోడ్ కూడా తన ఫ్లాగ్ షిప్ తో దీని సరసన కనిపించవచ్చు.
లెనోవో – సొంతాదారుగా ఉన్న మోటో చికాగో లో ఉన్నతన హెడ్ క్వార్టర్స్ లో రేపు జరగనున్న కార్యక్రమంలో మూడు స్మార్ట్ ఫోన్ల ను విడుదల చేయాలనీ ఆలోచనలోవుంది . వారివారి ఆసక్తి అనుగుణంగా, మోటో వన్ పవర్ మరియు మోటో వన్ గా అని ప్రముఖంగా తెలిసిన మోటో జెడ్3 మరియు ఆండ్రాయిడ్ వన్-పవర్డ్ డివైజ్ లను విడుదల చేయాలని అంచనా వేస్తుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది, అంటే భారతదేశ కాలమానం ప్రకారం ఆగష్టు 3 ఉదయం 12:30 గంటలకు ఈ క్రొత్త మోటో ఫోన్లు విడుదల కానున్నాయి.
ఈ మోటో జెడ్ గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు ఇంకా కంపెనీ ఈ వివరాలను గోప్యంగా ఉంచి మంచి పనిచేసింది,కానీ మోటో వన్ పవర్ మరియు మోటో వన్ లకు కూడా ఇదే విషయం వర్తిస్తుందని చెప్పలేము, ఎందుకంటే వీటి గురించి వచ్చిన అనేక లీకులు మరియు సర్టిఫికేషన్ లిస్టింగుల ద్వారా ఈ స్మార్ట్ ఫోన్లలో ఏమేమి వుండనున్నాయో ఒక అంచనాను అందించాయి.
మోటో జెడ్3 స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్
మోటో జెడ్3 మోటోరోలా యొక్క ఫ్లాగ్ షిప్ ఫోన్ గా అందించనుంది కాబట్టి ఇది 2018సంవత్సరం లో వచ్చిన చాల ఫోన్ల మాదిరిగానే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 చిప్సెట్ తో వవచ్చని మనం అంచనా వేయవచ్చు. ఆశ్చర్యకరంగా ఇది నోచ్ డిస్ప్లే లేకుండా 6.3- ఇంచ్ పొడవైన డిస్ప్లే ని అందించామని తెలిపారు.మోటో జెడ్2 ఫోర్స్ డిస్ప్లే లాంటిది కానీ , 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన 1080 X 2160 రిజల్యూషన్ ఇవ్వగల ఒక ఫుల్ హెచ్ డి + డిస్ప్లే ని వాడారు . ఈ మోటో జెడ్3 ఒక షట్టర్ ప్రూఫ్ కానీ డిజైన్ ,కానీ మోటో జెడ్ సిరీస్ ఫోన్లలో కనిపించే పోగొ పిన్స్ ని ఈ మోటో మోడ్స్ తన వెనుక భాగంలో జతగా ఉండవచ్చు.
ఆప్టిక్స్ పరంగా, మోటో జెడి3 ఈ రోజుల్లో సాధారణంగా అన్ని ఫోన్లలో కనిపించే ఒక 12 మెగాపిక్సెల్ తో కూడిన డ్యూయల్ – కెమేరాని వెనుకభాగం లో సెటప్ గా ఉంచింది. అలాగే ముందు భాగం లో 8-మెగాపిక్సెల్ ని వాడారు.
అన్నివివరాలు తెలిసినప్పటికీ బ్యాటరీ వివరాలు మాత్రం తెలియ రాలేదు, కానీ ఈ డివైజ్ క్విక్ ఛార్జ్ 4.0 సపోర్ట్ తో కూడిన ఒక ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉంటుందని భావించవచ్చు.
వేరియంట్ వివరాల్లోకి వెళితే ,ఈ మోటో జెడ్3 4జీబీ/6జీబీ ఇంకా 64జీబీ/128జీబీ నచ్చిన వేరియంట్ ను ఎంపికచేసుకునే వీలుంటుందని అంచనా వేయడమైనది.
మోటో వన్ పవర్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్
ఈ మోటో వన్ పవర్ అంది ఒక ఆండ్రాయిడ్ వన్ స్మార్టుఫోనే అని చాలకాలం నుంచి పుకార్లు వింటునాము, మోటో ఎక్స్4 తరువాత గూగుల్ యొక్క అప్డేట్ ప్రోగ్రామ్ కలిగిన మోటోరోలా యొక్క రెండవ డివైజ్ గా ఇది ఉండబోనుంది. ఈ మోటో వన్ పవర్, మోటో జెడ్3 లాగా కాకుండా నోచ్ డిస్ప్లేయ్ తో చాలాసార్లు కనిపించింది. ఈ డివైజ్ వెనుకభాగంలో బ్యాట్వింగ్ లోగోతో కూడిన ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని అమర్చారు. లీకైన చిత్రాల ద్వారా ఈ ఫోన్ యొక్క ఎడమ పైభాగంలో ఒక సిమ్ స్లాట్ మరియు కుడి పైభాగంలో అన్ని బటన్స్ కలిగి ఉండడం గమనించవచ్చు.ఇంకా ఫోన్ క్రింది భాగంలో గ్రిల్ తో కూడిన రెండు స్పీకర్లు వున్నాయి. ఈ డివైజ్ సహజంగానే ఇప్పుడున్న USB-C పోర్ట్ కలిగివుంది.
మోటో వన్ పవర్ ఒక 2280 X1080 పిక్సెల్ రిజల్యూషన్ అందించగల ఒక 6.2-ఇంచ్ ఫుల్ హెచ్ డి డిస్ప్లే ఫీచర్ గా ఉండవచ్చు. క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 636 SoC శక్తితో పనిచేస్తుంది మరియు 4జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజి ఇంకా స్టాక్ ఆండ్రాయిడ్ 8.1 తో వస్తుందని అంచనా. ఈ డివైజ్ ఒక 3780mAh కలిగివుంటుంది తెలిసింది.
కెమేరా విభాడానికి వస్తే , ఈ మోటో వన్ పవర్ f/1.8 మరియు f/2.0 ఆపేర్చేరు లెన్స్ గా కలిగిన, వరుసగా ఒక 12 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్ డ్యూయల్-కెమేరా ని కలిగి ఉంటుంది. ముందు భాగంలో f/2.2 ఆపేర్చేరు తో కూడిన 8ఎంపీ సెన్సార్ ఉంటుంది.
మోటో వన్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్
ఈ మోటో వన్ కూడా గూగుల్ యొక్క అప్డేట్ ప్రోగ్రామ్ ఆండ్రాయిడ్ వన్ తోనే వస్తుందని అంచనా,కానీ గమనించి చూసినట్లయితే ఇది మోటో వన్ యొక్క చవకైన వెర్షన్ గా అనిపిస్తుంది. స్పెసిఫికేషన్ విషయానికివస్తే, 19: 9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన 1080 x 2246 పిక్సెల్ రిజుల్యూషన్ అందించగల ఒక చిన్న 6.18-అంగుళాల 'నోచ్ ' డిస్ప్లే తో మోటో వన్ TENAA లిస్టింగ్ ని సూచిస్తుంది.
ఈ ఫోన్ మోటో వన్ పవర్ వలెనే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 శక్తితో పనిచేస్తుంది, అలాగే ఇది మూడు వేరియంట్లలో అందనుంది అవి – 3జీబీ/32జీబీ. 4జీబీ/64జీబీమరియు 6జీబీ/128జీబీ .
మోటో వన్ లో ఉండబోయే బ్యాటరీ మోటో వన్ పవర్ బ్యాటరికన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ ఫోన్ 2,820mAh బ్యాటరీతో కొంచెం వెనుకబడివుంది, కానీ రేటు పరంగా చుస్తే ఇది మోటో వన్ పవర్ కన్నా తక్కువ ధరగా ఉంటుంది.
ఇంకా , ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఒరేమో అందించవచ్చు , అలాగే ఇది గోల్డ్ ,సిల్వర్ మరియు బ్లాక్ కలర్ మోడల్స్ లో లభించనుంది.
మోటో 5జి మోడ్
మాకు పూర్తిగా వివరాలు అందని కారణంగా ,దీని గురించి పూర్తిగా వివరించలేక పోతున్నాము ఇక్కడ ,అయితే చాలాకాలంగా ఎదురు చూస్తున్న మోటో 5జి మోడ్ ని కూడా ఈ రోజే విడుదల చేయాలని మోటోరోలా అంచనావేస్తోంది. దీనిలో ఎక్కువ శాతం ఫోన్లు 2019 లో అందున్న 5జి కి రెడీగా వుండనున్నాయి ,OEMs అయిన వన్ ప్లస్ మరియు హువాయి లాగ , 5G సిద్ధంగా ఉన్న పరికరాలను ముందుకు తీసుకెళ్లడానికి పోటీ పడుతున్నాయి.ఈ రిపోర్టు ఒకే విధమైన పరిశ్రమ వనరులను సూచకప్రాయంగా ఉదహరించింది. లీకైన చిత్రాలలో చూపించినట్లుగా ఈ మోటో 5జి మోడ్ ఒక చొచ్చుకువచిన యాంటెన్నా ఉన్నట్లు చూపించారు. దీనిని ఫోన్ మీద కొట్టినప్పుడు , దీని యొక్క వెడల్పు సరిచేసికోవచ్చు అనేది గమనించదగ్గ విషయం. మోటో జెడ్3 మరియు దాని 5జి కంపానియన్ మోడ్ యొక్క ధర ఎంత ఉండనుండో ఇంకా తెలియరాలేదు.