మోటోరోలా ఇండియాలో మోటో ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్ మే 23న విడుదల చేస్తునట్లు ప్రకటించింది. ఈ ఫోన్ భారీ ఫీచర్లు మరియు స్పెక్స్ తో వస్తున్నట్లు మోటోరోలా ఇప్పటికే టీజింగ్ మొదలు పెట్టింది. అందుకే, ఈ మోటోరోలా అప్ అప్ కమింగ్ ఫోన్ టాప్-5 ఫీచర్లు పైన ఒక లుక్కేద్దామా.
ఈ ఫోన్ ను 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 3D Curved pOLED డిస్ప్లేని HDR 10+ స్పోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ డిస్ప్లే లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 1200 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ వుంది.
ఈ ఫోన్ ను మోటోరోలా మీడియాటెక్ 8020 SoC మరియు 8GB LPDDR4X + UFS (3.1) 256GB స్టోరేజ్ తో జత చేసినట్లు తెలిపింది. ఈ ప్రోసెసర్ తో లాంచ్ అయ్యే ఫస్ట్ ఫోన్ ఇదే అని మోటోరోలా తెలిపింది.
ఈ మోటో ఎడ్జ్ 40 ఫోన్ లో 50MP (OIS) + 13MP అల్ట్రా వైడ్ + మ్యాక్రో సెన్సార్ లను కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరా గురించి కంపెనీ చాలా గొప్పగా చెబుతోంది.
ఈ ఫోన్ ను 4400 mAh బ్యాటరీని 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకు వస్తున్నట్లు తెలిపింది.
ఈ ఫోన్ లో బెటర్ నెట్ వర్క్ కోసం eSIM మరియు ThinkShield లను అందించినట్లు తెలిపింది.