Moto G51 5G: మోటోరోలా నుండి మరొక 5G స్మార్ట్ ఫోన్
మోటోరోలా ఈసారి 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి సిద్దముతోంది
ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ 5G ప్రోసెసర్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్
8GB ర్యామ్ మరియు మరిన్ని ట్రెండీ ఫీచర్లతో ఉంటుంది
ఇటీవలే తన బడ్జెట్ బీస్ట్ Moto G31 ను విడుదల చేసిన మోటోరోలా ఈసారి 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి సిద్దముతోంది. లేటెస్ట్ లీక్స్ ద్వారా మోటోరోలా Moto G51 5G స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 10 న ఇండియాలో విడుదల చెయ్యడానికి యోచిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ 5G ప్రోసెసర్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్. అంతేకాదు, ఇది గరిష్టంగా 8GB ర్యామ్ మరియు మరిన్ని ట్రెండీ ఫీచర్లతో ఉంటుంది.
Moto G51: అంచనా ధర మరియు స్పెక్స్
వాస్తవానికి, Moto G31 స్మార్ట్ ఫోన్ యూరప్ లో విడుదల చేయబండిది. గత నెలలో విడుదలైన ఈ G51 5G స్మార్ట్ ఫోన్ యూరోప్‌లో EUR 229.99 (సుమారు రూ. 19,600)తో ప్రారంభించబడింది. ఇండియాలో కూడా దాదాపుగా ఇదే ధరలో, అంటే రూ.19,999 రూపాయల ధరలో ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక మోటో జి51 స్పెషిఫికేషన్స్ విషయానికి వస్తే, ఇండియన్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ, యూరప్ లో విడుదల చెయ్యబడిన అదే వేరియంట్ రావచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
Moto G51 యూరప్ వేరియంట్ పెద్ద 6.8 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు జతగా 8GB RAMతో వస్తుంది. కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP ట్రిపుల్ రియర్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరాలను కలిగివుంటుంది. ఈ ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో వస్తుంది.