motorola launching budget stylus phone Motorola Edge 60 stylus
Motorola Edge 60 stylus: మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్ నుంచి బడ్జెట్ స్టైలస్ పెన్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు మోటోరోలా అనౌన్స్ చేసింది. అదే, మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ఇన్ బిల్ట్ స్టైలస్ పెన్ తో వస్తుంది. మరి ఈ ఫోన్ బడ్జెట్ ఫోన్ అని ఎందుకు చెబుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఆ విషయానికే వస్తున్నా, ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో స్టైలస్ పెన్ కలిగిన మొదటి ఫోన్ గా వస్తోందని మోటోరోలా తెలిపింది. ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కూడా మోటోరోలా వెల్లడించింది.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 15వ తేదీన ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజీ నుని ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ pOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ మరియు హై బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బిల్ట్ ఇన్ స్టైలస్ పెన్ తో వస్తుంది, అంతేకాదు, ఈ స్టైలస్ AI స్కెచ్ టూ ఇమేజ్ మరియు AI సపోర్ట్ తో తో వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇన్స్టాంట్ షాపింగ్ కోసం గ్లాన్స్ AI ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం పాంటోన్ కలర్స్ వేగాన్ లెథర్ ఫినిష్ తో వస్తుంది. ఈ ఫోన్ ను మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ MIL-810 సర్టిఫికేషన్ మరియు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో అందిస్తోంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Moto AI సపోర్ట్ కలిగిన 50MP (Sony LYT 700C) ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది మరియు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 68W టర్బో పవర్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ ఫోన్ 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ ఎప్పుడు చూడనంత చవక ధరకు లభిస్తోంది.!
ఈ ఫోన్ కలిగిన స్టైలస్ పెన్ తో యూజర్ శ్రమలేకుండా కామాండ్స్ అందించడమే కాకుండా క్రియేటివిటీ పనులను కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది.