మోటోరోలా ఈరోజు కొత్త ఫోన్ ను విడుదల చేసింది. అదే Moto G05 స్మార్ట్ ఫోన్ మరియు ఇది ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ ను చవక ధరలో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు మరియు వేగాన్ లెథర్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో అందించింది. ఈరోజే సరికొత్తగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 6,999 రూపాయల బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ జనవరి 13 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. Flipkart నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
మోటోరోలా ఈ ఫోన్ ను 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.67 ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Helio G81 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 4GB ర్యామ్ మరియు 8GB వరకూ ర్యామ్ బూస్ట్ ఫీచర్ తో టోటల్ 12GB వరకు ర్యామ్ ఫీచర్ ను అందిస్తుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
ఈ మోటోరోలా కొత్త ఫోన్ వెనుక 50MP క్వాడ్ పిక్సెల్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ Dolby Atmos మరియు Hi-Res Audio సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. మోటో జి05 ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ను 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5200 mAh బిగ్ బ్యాటరీతో అందించింది. ఈ ఫోన్ ఎంటర్టైన్మెంట్ కోసం కావాల్సిన అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: itel A80 స్మార్ట్ ఫోన్ రూ. 6,999 ధరలో 50MP HDR కెమెరాతో లాంచ్.!
మోటోరోలా ఈ బడ్జెట్ ఫోన్ ను IP52 వాటర్ రేపెళ్లేంట్ ఫీచర్ మరియు వాటర్ టచ్ టెక్నాలజీతో కూడా అందించింది. ఈ ఫోన్ ను రెండు మరియు గ్రీన్ రెండు కలర్ ఆప్షన్ లలో అందించింది.