భారీ ఆఫర్లతో ఈరోజు నుంచి మొదలైన Motorola g45 5G స్మార్ట్ ఫోన్ సేల్.!

Updated on 28-Aug-2024
HIGHLIGHTS

Motorola g45 5G సేల్ కి ఈరోజు నుంచి మొదలయ్యింది

భారీ బ్యాంక్ ఆఫర్ తో మోటోరోలా ఈరోజు సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది

ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను Motorola అందించింది

మోటోరోలా భారత మార్కెట్లో సరికొత్తగా విడుదల చేసిన బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ Motorola g45 5G సేల్ కి ఈరోజు నుంచి మొదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ బ్యాంక్ ఆఫర్ తో మోటోరోలా ఈరోజు సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది. 10 వేల బడ్జెట్ ధరలో మార్కెట్ లో ఉన్న చాలా 5జి స్మార్ట్ ఫోన్ లకు పోటీగా ఈ ఫోన్ ను మోటోరోలా తీసుకు వచ్చింది.

Motorola g45 5G : ప్రైస్

మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 4GB + 128GB వేరియంట్ రూ. 10,999 ధరతో, 8GB + 128GB వేరియంట్ రూ. 12,999 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ ను Flipkart మరియు motorola.in నుంచి సేల్ కి అందుబాటులో ఉంది.

ఆఫర్లు

ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఫోన్ ను Axis మరియు IDFC First బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను కేవలం రూ. 9,999 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

Motorola g45 5G : ఫీచర్స్

మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను 10 వేల ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తోనే అందించింది. జి45 స్మార్ట్ ఫోన్ Snapdragon 6s Gen 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ప్రోసెసర్ లో లైట్ ఫోటోలు, ఫాస్ట్ డౌన్ లోడింగ్ మరియు మంచి పవర్ మేనేజ్మెంట్ తో వస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

ఈ మోటోరోలా లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ IPS LCD స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ FHD రిజల్యూషన్ వీడియోలను 30fps తో షూట్ చేయగలదు మరియు స్టడీ ఫోటోలు అందిస్తుంది.

Also Read: Jio New Plan: ప్రీమియం కంటెంట్ మరియు అన్లిమిటెడ్ లాభాలతో కొత్త ప్లాన్ తెచ్చిన జియో.!

ఈ మోటోరోలా జి45 5జి స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ ధరలో Dolby Atmos మరియు Hi-Res సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగిన ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని టర్బో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :