MOTOROLA G34 5G: చవక ధరలో స్టన్నింగ్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది.!

Updated on 09-Jan-2024
HIGHLIGHTS

MOTOROLA G34 5G ను ఈరోజు మార్కెట్ లో మోటోరోలా విడుదల చేసింది

ఈ ఫోన్ ను చాలా చవక ధరలో స్టన్నింగ్ ఫీచర్లతో లాంచ్ చేసింది

ఈ ఫోన్ ను 10 వేల బడ్జెట్ ధరలో మరిన్ని ఫీచర్లతో అందించింది

MOTOROLA G34 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు మార్కెట్ లో మోటోరోలా విడుదల చేసింది . మోటోరోలా బడ్జెట్ సిరీస్ గా చెప్పబడే G సిరీస్ నుండి ఈ కొత్త ఫోన్ ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ను చాలా చవక ధరలో స్టన్నింగ్ ఫీచర్లతో లాంచ్ చేసింది మోటోరోలా. ప్రస్తుతం భారత మార్కెట్ లో అందుబాటులో ఉన్న చాలా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లకు ఈ ఫోన్ భారీ పోటీగా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ ను కంపెనీ 10 వేల బడ్జెట్ ధరలో మరిన్ని ఫీచర్లతో అందించింది.

MOTOROLA G34 5G Price

మోటోరోలా జి34 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 10,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది 4 GB + 128 GB వేరియంట్ ధర. ఈ ఫోన్ యొక్క 8 GB + 128 GB వేరియంట్ ను రూ. 11,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను లాంచ్ ఆఫర్ లో భాగంగా అందించింది. మోటోరోలా జి34 5జి స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ జనవరి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ ఫోన్ ను మోటోరోలా వెబ్సైట్ మరియు Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

మోటోరోలా జి34 5జి ప్రత్యేకతలు

మోటోరోలా జి34 5జి స్మార్ట్ ఫోన్ ను సన్నని మరియు అల్ట్రా ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 6.5 ఇంచ్ డిస్ప్లే HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్ లను కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 OS తో మోటోరోలా లాంచ్ చేసింది.

మోటోరోలా జి34 5జి ఫోన్ ను Snapdragon 695 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ బడ్జెట్ కేటగిరిలో ఈ ప్రోసెసర్ ను కలిగిన ఏకైక ఫోన్ ఇదే అవుతుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB RAM మరియు 8GB వరకూ ర్యామ్ బూస్టర్ ఫీచర్ తో పాటుగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ 50MP + 2MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమేరా సెటప్ వుంది మరియు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.

Also Read : vivo Y28 5G launch: కొత్త బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్ చేసిన వివో.!

ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 20W ఫాస్ట్ ఛార్జర్ ను బాక్స్ తో పాటుగా అందచేస్తోంది మోటరోలా.

ఈ ఫోన్ యొక్క స్పెక్స్ ను చూస్తే, ఈ ధర పరిధిలో ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉందని తడుముకోకుండా చెప్పవచ్చు. అయితే, ఈ ఫోన్ రివ్యూ చేసిన తరువాత ఖచ్చితమైన రేటింగ్ మరియు వివరాలను అందించ గలుగుతాము.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :