MOTOROLA G04: అతి చవక 8GB RAM ఫోన్ మొదటి సేల్ రేపటి నుండి మొదలు.!
మోటోరోలా జి04 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్
ఈ ఫోన్ అల్రౌండ్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది
ఈ మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 OS తో పని చేస్తుంది
MOTOROLA G04: మోటోరోలా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మోటోరోలా జి04 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. భారత మార్కెట్ లో కొనసాగుతున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లకు గట్టి పోటీగా మోటోరోలా తీసుకు వచ్చిన ఈ ఫోన్ అల్రౌండ్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. రేపటి నుండి సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్, ఫీచర్స్ మరియు ధర వివరాలు తెలుసుకోండి.
MOTOROLA G04 Price
మోటోరోలా జి04 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్ లలో విడుదల చేసింది. వీటిలో, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 4GB + 64GB వేరియంట్ ను రూ. 6,999 ధరతో మరియు 8GB + 128GB వేరియంట్ ను రూ. 7,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Flipakrt మరియు మోటోరోలా అధికారిక వెబ్సైట్ motorola.in ద్వారా రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ కి అంధుబాటులో ఉంటుంది.
Also Read: HONOR X9b 5G ఫోన్ పైన అందించిన భారీ ఆఫర్లు మిస్సవకండి.!
మోటోరోలా జి04 ప్రత్యేకతలు
మోటోరోలా జి04 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ IPS LCD డిస్ప్లేని HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా ఫోన్ Unisoc T606 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 8GB RAM boost సపోర్ట్ ను కూడామా మోటోరోలా అందించింది.
ఈ ఫోన్ ఈ బడ్జెట్ కేటగిరిలో Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన ఏకైక ఫోన్ గా నిలుస్తుంది. ఇక ఆప్టిక్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 16MP సింగల్ కెమేరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ ను 20W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బీబీగ్ బ్యాటరీతో మోటోరోలా అందించింది. అంతేకాదు, ఈ మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 OS తో పని చేస్తుంది.