Motorola Edge 60 Fusion launching with latest Sony camera and AI support
Motorola Edge 60 Fusion: మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ను గురించి అనౌన్స్ చేసింది. మోటో ఎడ్జ్ సిరీస్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ భారీ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఫోన్ ప్రధాన ఫీచర్లు కూడా వెల్లడించింది. మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది మరియు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ఏమిటో చూసేద్దాం పదండి.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ పేజీ నుండి ఈ అప్ కమింగ్ ఫోన్ కీలకమైన ఫీచర్ కూడా వెల్లడించింది.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ యొక్క 5 కీలకమైన మరియు ప్రధానమైన ఫీచర్స్ మోటోరోలా వెల్లడించింది. ఇందులో మొదటిది ఈ ఫోన్ యొక్క డిస్ప్లే అని చెబుతోంది. ఈ ఫోన్ ను 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన ఆల్ కర్వుడ్ డిస్ప్లేతో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా తెలిపింది. అంతేకాదు, ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్, వాటర్ టచ్ 3.0 ఫీచర్ మరియు గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ కలిగి ఉంటుంది.
రెండవది ఈ ఫోన్ యొక్క కెమెరా అని చెబుతోంది. ఎందుకంటే, ఈ ఫోన్ ను సోనీ లేటెస్ట్ గా అందించిన Sony – LYT 700C కెమెరాతో లాంచ్ చేస్తోంది. అంతేకాదు, ఈ కెమెరాతో లాంచ్ అవుతున్న మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మూడవది ఈ యొక్క డిజైన్ అని టీజర్ లో తెలిపింది. ఈ ఫోన్ ను పటిష్టమైన MIL-810H డిజైన్ మరియు IP68 + IP69 రేటింగ్ తో వాటర్ ప్రూఫ్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
Also Read: Realme GT 6T 5G ఫోన్ పై అమెజాన్ రూ. 6,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
ఈ మోటోరోలా అప్ కమింగ్ ఫోన్ ను మీడియాటెక్ కొత్త చిప్ సెట్ Dimensity 7400 తో తీసుకువస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ చిప్ సెట్ తో లాంచ్ అవుతున్న మొదటి ఫోన్ కూడా ఇదే. దానికి సపోర్ట్ గా 8GB ర్యామ్ మరియు 128GB / 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను moto AI సపోర్ట్ తో అందిస్తున్నట్లు కూడా క్లియర్ చేసింది. ఈ ఐదు కీలకమైన ఫీచర్స్ గురించి మోటోరోలా ప్రధానంగా చెబుతోంది.
ఇది కాకుండా ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ మరియు 68 W టర్బో పవర్ సపోర్ట్ కూడా ఉంటాయి. Hello UI సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 15 OS తో నడుస్తుంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల OS అప్గ్రేడ్ లు మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుందని మోటోరోలా తెలిపింది.