Motorola Edge 60 Fusion 5G launched know the price and features
Motorola Edge 60 Fusion 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను స్టన్నింగ్ ఫీచర్స్ మరియు సరికొత్తగా డిజైన్ తో బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ ఓన్లీ ట్రూ కలర్ డిస్ప్లే కలిగిన ఫోన్ అని కంపెనీ గొప్పగా చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. సరికొత్తగా ఈరోజు విడుదలైన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందమా.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులో , 8GB + 256GB బేసిక్ వేరియంట్ ను రూ. 22,999 ధరతో మరియు 12GB + 256GB హై ఎండ్ వేరియంట్ ను రూ. 24,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొదటి సేల్ ఏప్రిల్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై గొప్ప లాంచ్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది.
ఈ ఫోన్ పై రూ. 2000 రూపాయల లాంచ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను Axis మరియు IDFC కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది.
Also Read: Lava Bold 5G: 10 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో 5G ఫోన్ లాంచ్ చేసిన లావా.!
ఈ మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు సరికొత్త కలర్ ఆప్షన్ లతో వచ్చింది. ఈ ఫోన్ IP68 + IP69 మరియు MIL – 810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది. అంటే, ఈ ఫోన్ చాలా పటిష్టమైన డిజైన్ తో పాటు నీటిలో పడినా నష్టం వాటిల్లని విధంగా ఉంటుంది. ఈ ఫోన్ లో గొప్ప స్క్రీన్ ను మోటోరోలా అందించింది. ఈ ఫోన్ 6.67 ఇంచ్ ఆల్ కర్వుడ్ pOLED స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు దీనికి రక్షణగా గొరిల్లా గ్లాస్ 7i గ్లాస్ కూడా ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10+ సపోర్ట్, 1.5K రిజల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, SGS ఐ కేర్ ప్రొటెక్షన్ మరియు వాటర్ టచ్ 3.0 వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 5G చిప్ సెట్ తో లంచ్ అయ్యింది. దానికి జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ moto ai సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP Sony – LYT 700C ప్రధాన సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు ai సపోర్టడ్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జి స్మార్ట్ ఫోన్ లో5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 68W టర్బో పవర్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లేటెస్ట్ Hello UI సాఫ్ట్ వేర్ పై Android 15 OS తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 3 సంవత్సరాల OS అప్గ్రేడ్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్ లకు సపోర్ట్ చేస్తుంది.