Motorola Edge 50 ultra: ఈ నెలలో మోటోరోలా ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా లాంచ్ కి రంగం సిద్ధం అయ్యింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను Moto AI మరియు సినిమాటిక్ స్క్రీన్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ తో విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ టీజింగ్ ఫీచర్స్ మరియు స్పెక్స్ చూస్తుంటే, ఈ ఫోన్ మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారేలా కనిపిస్తోంది. మరి ఈ మోటోరోలా అప్ కమింగ్ ఫోన్, మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఎటువంటి వివరాలతో మార్కెట్లో విడుదల కాబోతోందో ఒక లుక్కేద్దామా.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ జూన్ 18వ తేది ఇండియాలో విడుదల అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ఇప్పటి నుండే మైక్రో సైట్ పేజి ద్వారా టీజింగ్ చేస్తోంది మరియు ఈ పేజీ నుండి ఈ ఫోన్ కీలకమైన వివరాలను కూడా వెల్లడించింది.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కంపెనీ ఇప్పటికే అందించింది. మోటోరోలా టీజర్ పేజీ ప్రకారం, ఈ ఫోన్ 6.7 ఇంచ్ Curved pOLED 10bit డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్, 2500 పీక్ బ్రైట్నెస్, ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ డిస్ప్లే అత్యంత కఠినమైన గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో ఉంటుంది మరియు సినిమాటిక్ విజువల్స్ అందిస్తుందని మోటోరోలా చెబుతోంది.
ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో అందిస్తున్నట్లు కూడా మోటోరోలా తెలిపింది. ఈ ప్రోసెసర్ తో పాటుగా ఈ ఫోన్ లో 12GB RAM మరియు 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయని కూడా తెలిపింది. ఈ మోటోరోలా ఫోన్ ను Moto ai మరియు స్మార్ట్ కనెక్ట్ ఫీచర్లతో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరాని AI పవర్ తో అందించినట్లు కూడా తెలిపింది. ఈ కెమెరా 100x AI సూపర్ జూమ్ AI మ్యాజిక్ కాన్వాస్ ఫీచర్లతో ఉంటుందని టీజర్ లో క్లియర్ చేసింది.
Also Read: Airtel గుడ్ న్యూస్: రూ. 395 ప్లాన్ పై 14 రోజుల అధిక వ్యాలిడిటీ ప్రకటించిన ఎయిర్టెల్.!
ఈ మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో ఫ్లాగ్ షిప్ ఛార్జ్ టెక్ ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 120W టర్బో పవర్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్, 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు 10W వైర్లెస్ పవర్ షేరింగ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది.
ఈ టీజింగ్ వివరాలు చూస్తుంటే, ఈ ఫోన్ ను ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న చాలా స్మార్ట్ ఫోన్ లకు గొప్ప పోటిగా తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది.