digit zero1 awards

Motorola Edge 50 ultra: మోటో AI మరియు సినిమాటిక్ స్క్రీన్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ తో వస్తోంది.!

Motorola Edge 50 ultra: మోటో AI మరియు సినిమాటిక్ స్క్రీన్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ తో వస్తోంది.!
HIGHLIGHTS

Motorola Edge 50 ultra లాంచ్ కి రంగం సిద్ధం అయ్యింది

Moto AI మరియు సినిమాటిక్ స్క్రీన్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ తో విడుదల చేయబోతోంది

జూన్ 18వ తేది మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఇండియాలో విడుదల అవుతుంది.

Motorola Edge 50 ultra: ఈ నెలలో మోటోరోలా ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా లాంచ్ కి రంగం సిద్ధం అయ్యింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను Moto AI మరియు సినిమాటిక్ స్క్రీన్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ తో విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ టీజింగ్ ఫీచర్స్ మరియు స్పెక్స్ చూస్తుంటే, ఈ ఫోన్ మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారేలా కనిపిస్తోంది. మరి ఈ మోటోరోలా అప్ కమింగ్ ఫోన్, మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఎటువంటి వివరాలతో మార్కెట్లో విడుదల కాబోతోందో ఒక లుక్కేద్దామా.

Motorola Edge 50 ultra: లాంచ్ డేట్

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ జూన్ 18వ తేది ఇండియాలో విడుదల అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ఇప్పటి నుండే మైక్రో సైట్ పేజి ద్వారా టీజింగ్ చేస్తోంది మరియు ఈ పేజీ నుండి ఈ ఫోన్ కీలకమైన వివరాలను కూడా వెల్లడించింది.

Motorola Edge 50 ultra: ఫీచర్స్

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కంపెనీ ఇప్పటికే అందించింది. మోటోరోలా టీజర్ పేజీ ప్రకారం,  ఈ ఫోన్ 6.7 ఇంచ్ Curved pOLED 10bit డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్, 2500 పీక్ బ్రైట్నెస్, ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ డిస్ప్లే అత్యంత కఠినమైన గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో ఉంటుంది మరియు సినిమాటిక్ విజువల్స్ అందిస్తుందని మోటోరోలా చెబుతోంది.

Motorola Edge 50 ultra Features
Motorola Edge 50 ultra Features

ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో అందిస్తున్నట్లు కూడా మోటోరోలా తెలిపింది. ఈ ప్రోసెసర్ తో పాటుగా ఈ ఫోన్ లో 12GB RAM మరియు 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయని కూడా తెలిపింది. ఈ మోటోరోలా ఫోన్ ను Moto ai మరియు స్మార్ట్ కనెక్ట్ ఫీచర్లతో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరాని AI పవర్ తో అందించినట్లు కూడా తెలిపింది. ఈ కెమెరా 100x AI సూపర్ జూమ్ AI మ్యాజిక్ కాన్వాస్ ఫీచర్లతో ఉంటుందని టీజర్ లో క్లియర్ చేసింది.

Also Read:  Airtel గుడ్ న్యూస్: రూ. 395 ప్లాన్ పై 14 రోజుల అధిక వ్యాలిడిటీ ప్రకటించిన ఎయిర్టెల్.!

ఈ మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో  ఫ్లాగ్ షిప్ ఛార్జ్ టెక్ ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 120W టర్బో పవర్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్, 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు 10W వైర్లెస్ పవర్ షేరింగ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది. 

ఈ టీజింగ్ వివరాలు చూస్తుంటే, ఈ ఫోన్ ను ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న చాలా స్మార్ట్ ఫోన్ లకు గొప్ప పోటిగా తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo