Motorola Edge 50 Ultra 5G: మోటోరోలా ఫ్లాగ్ షిప్ ఫోన్ టాప్ 5 ఫీచర్లు మరియు ధర వివరాలు ఇవే.!

Updated on 19-Jun-2024
HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్లో Motorola Edge 50 Ultra 5G ఫోన్ ను విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్లు మరియు స్పెక్స్ తో తీసుకు వచ్చింది

ఈ మోటోరోలా ఫ్లాగ్ షిప్ ఫోన్ టాప్ 5 ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి

Motorola Edge 50 Ultra 5G: ఇండియన్ మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్ నుంచి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్లు మరియు స్పెక్స్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్లతో ప్రీమియం ధరలో మోటోరోలా అందించింది. ఈ ఫోన్ మోటో AI సపోర్ట్ మరియు ఫ్లాగ్ షిప్ క్వాల్కమ్ ప్రోసెసర్ తో పాటు మరిన్ని ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది. సరికొత్తగా ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ మోటోరోలా ఫ్లాగ్ షిప్ ఫోన్ టాప్ 5 ఫీచర్లు మరియు ధర వివరాలు తెలుసుకోండి.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో : ధర

Motorola Edge 50 Ultra 5G

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ ను కేవలం 12GB + 512GB సింగల్ వేరియంట్ లో రూ. 54,999 రూపాయల ధరతో విడుదల చేసింది.      

Motorola Edge 50 Ultra 5G: టాప్ 5 ఫీచర్లు

డిజైన్

ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు వేగాన్ లెథర్ (రియల్ వుడ్) డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ తో కూడా వస్తుంది.       

స్క్రీన్

ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ 3D కర్వుడ్ pOLED స్క్రీన్ తో ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ సపోర్ట్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది.

పెర్ఫార్మెన్స్

ఈ మోటోరోలా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 8s Gen 3 తో తీసుకు వచ్చింది. ఈ చిప్ సెట్ కి జతగా 12GB LPDDR RAM + ర్యామ్ బూస్ట్ సపోర్ట్ మరియు 512GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 OS పై నడుస్తుంది.

Also Read: Flipkart Sale: 7 వేల నుంచి 10 వేల బడ్జెట్ లో పెద్ద Smart Tv బెస్ట్ డీల్స్..! 

కెమెరా

ఈ స్మార్ట్ ఫోన్ లో గొప్ప కెమెరా సెటప్ ను మోటో AI సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగివుంది. ఇందులో, 50MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్, 64MP టెలీ ఫోటో మరియు లేజర్ ఆటో ఫోకస్ సెన్సార్ ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ కెమెరాతో 60 మరియు 30fps వద్ద 4K UHD వీడియోలను మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గొప్ప ఫోటోలు షూట్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. 

బ్యాటరీ

ఈ ఫోన్ 125W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్, 50W వైర్లెస్ ఛార్జ్ మరియు 10W వైర్లెస్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4500mAh బ్యాటరీ కలిగి వుంది. ఈ ఫోన్ పీచ్ ఫజ్, నార్డిక్ వుడ్ మరియు ఫారెస్ట్ గ్రే (వేగాన్ లెథర్) మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.                             

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :