Motorola Edge 50 Pro: ఈరోజు మోటోరోలా లేటెస్ట్ గా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ లాంఛ్ కోసం గత కొంత కాలంగా టీజింగ్ చేస్తూ వస్తున్న మోటోరోలా కంపెనీ, ఎట్టకేలకు ఈరోజు ఇండియన్ మారెక్ట్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన ధరలో భారీ ఫీచర్స్ తో విడుదల చేసింది. మోటోరోలా సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ స్పెక్స్, ఫీచర్స్ మరియు ప్రైస్ వివరాలలు తెలుసుకుందామా.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ (8GB + 256GB) వేరియంట్ రూ. 31,999 రూపాయల ప్రారంభ ధరతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ (12GB + 256GB) ను రూ. 35,999 ధరతో విడుదల చేసింది. అయితే, బేసిక్ వేరియంట్ 68W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటే, హై ఎండ్ వేరియంట్ 125W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ ఫోన్ పైన లాంఛ్ ఆఫర్లను కూడా మోటోరోలా అందించింది. ఈ ఫోన్ పైన HDFC బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 2,500 డిస్కౌంట్ లేదా రూ. 2,000 అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను మోటోరోలా అందించింది.
Also Read: 8 వేలకే 120-inch ఇంచ్ స్క్రీన్ అందించే Smart Projector వచ్చేసింది.!
ఈ ఫోన్ లో అద్భుతమైన డిస్ప్లేని మోటోరోలా అందించింది. మోటోరోలా ఈ ఫోన్ లో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన 6.7 ఇంచ్ 144 Hz pOLED డిస్ప్లేని అందించింది. ఇది 1.5 రిజల్యూషన్ఇ కలిగి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు SGS ఐ ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ ని కలిగి వుంది.
ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ వేగవంతమైన మిడ్ రేంజ్ ప్రోసెసర్ Snapdragon 7 Gen 3 తో పని చేస్తుంది. ఇది Helo UI పైన Android 14 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 12 GB RAM మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ను IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ తో కూడా తీసుకు వచ్చింది.
కెమేరాల పరంగా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. ఇందులో 50MP మెయిన్ + 13MP (మ్యాక్రో + అల్ట్రా వైడ్) + OIS టెలిఫోటో సెన్సార్ లు ఉన్నాయి. అంతేకాదు, ముందు 50MP సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరాతో సెటప్ తో అద్భుతమైన కలర్ యాక్యురసీ కలిగిన ఫోటోలు మరియు వీడియోలు షూట్ చేయవచ్చని మోటోరోలా చెబుతోంది.
ఈ ఫోన్ ను మోటోరోలా రెండు రకాలైన ఛార్జ్ సపోర్ట్ లతో అందించింది. ఈ ఫోన్ యొక్క 8GB ర్యామ్ వేరియంట్ ను 65W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. అయితే, 12GB ర్యామ్ వేరియంట్ ను మాత్రం 125W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ రెండు వేరియంట్ లు కూడా 4500mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. అంతేకాదు, 50W TurboPower వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో వుంది.