Motorola Edge 50 Pro: సూపర్ కెమేరా మరియు 3D Curved డిస్ప్లేతో వస్తోంది.!

Updated on 18-Mar-2024
HIGHLIGHTS

మోటోరోలా నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంఛ్ కోసం రెడీ అయ్యింది

Motorola Edge 50 Pro త్వరలోనే లాంఛ్ చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఫోన్ వివరాలను బయట పెట్టింది

Motorola Edge 50 Pro: మోటోరోలా నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంఛ్ కోసం రెడీ అయ్యింది. అదే, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను త్వరలోనే లాంఛ్ చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ‘Coming Soon’ ట్యాగ్ తో మోటోరోలా టీజింగ్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఫోన్ వివరాలను బయట పెట్టింది.

Motorola Edge 50 Pro: Teaser

మోటోరోలా అధికారిక X అకౌంట్ నుండి ఈ ఫోన్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కోసం ఫ్లిప్ కార్ట్ కూడా మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క టీజర్ ద్వారా మోటోరోలా ఈ ఫోన్ పైన భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

Also Read: Flipkart Sale నుండి 1.5 Ton Split AC ల పైన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

Motorola Edge 50 Pro: టీజ్డ్ స్పెక్స్

మోటోరోలా యోక్క అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ వివరాలు కొన్ని తెలియ వచ్చాయి. వాస్తవానికి, ఈ ఫోన్ యొక్క డిస్ప్లే, డిజైన్ మరియు కెమేరా వివరాలు ఈ టీజర్ ద్వారా తెలుస్తున్నాయి. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ వెనుక లెథర్ బ్యాక్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో 3D Curved డిస్ప్లే కూడా వుంది.

Motorola Edge 50 Pro Camera

మొత్తంగా ఈ ఫోన్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా కనిస్తోంది. ఇక కంపెనీ ఈ ఫోన్ కెమేరా గురించి ప్రత్యేకంగా చెబుతోంది. ఈ ఫోన్ Pantone కలర్ వ్యాలిడేషన్ తో AI-Powered Camera తో వచ్చే మొదటి ఫోన్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ కెమేరాలో 10MP టెలిఫోటో సెన్సార్ 50X Hybrid Zoom ఫీచర్ ను కూడా కలిగి ఉందని మోటోరోలా తెలిపింది.

Motorola Edge 50 Pro Display

ఇక డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ లో చాలా ప్రీమియం లుక్స్ తో కనిపిస్తున్న 3D Curved డిస్ప్లే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ డిస్ప్లే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు HDR 10+ సపోర్ట్ మరియు అధిక బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :