మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Motorola Edge 50 Pro ఫీచర్స్ తో కంపెనీ భారీ అంచనాలను సృష్టిస్తోంది. ఈ ఫోన్ ను ఎప్పుడు విడుదల చేస్తుందనే డేట్ కన్ఫర్మేషన్ ని మాత్రమే ఇంకా ప్రకటించలేదు. కానీ, ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ తో భారీ టీజింగ్ కాంపైన్ ను మాత్రం నిర్వహిస్తోంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే మరియు కెమేరా ఫీచర్స్ తో ఇప్పటికే ఈ ఫోన్ ను ఆకాశానికి ఎత్తేస్తోంది. మరి ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఎలా ఉన్నదో, దీని ఫీచర్లు ఏమితో తెలుసుకుందామా.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ ఊరించి కంపెనీ చాలా గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ డిజైన్ మొదలు కొని కెమేరా మరియూయి డిస్ప్లే వరకూ సరికొత్తగా ఉన్నట్లు చెబుతోంది. ఈ ఫోన్ World’s 1st AI-Powered కెమేరాగా ఇండియన్ మార్కెట్ లో విడుదల అవుతోందని మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ AI – Photo Enhancement Engine తో ఫోన్ గొప్పగా తీర్చి దిద్దగల శక్తితో ఉంటుందని చెబుతోంది.
అంతేకాదు, ఆటో ఫోకస్ తో AI అడాప్టివ్ స్టెబిలైజేషన్ తో చాలా స్టేబుల్ మరియు బ్లర్ లేకుండా ఫోటోలను నడుస్తున్నప్పుడు కూడా తేజ్ వీలుందని కూడా చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ కెమేరా సెటప్ లో అందించిన 10MP Telephoto lens తో 50X హై బ్రెడ్ జూమ్ ను కూడా అందుతుందని మోటోరోలా తెలిపింది.
Also Read: Realme Narzo 70 Pro: పవర్ ఫుల్ కెమేరా మరియు డిస్ప్లేతో వచ్చింది.!
ఈ ఫోన్ లో ఉన్న మరొక ప్రత్యేకత గురించి కూడా కంపెనీ గొప్పగా చెబుతోంది. అదేమిటంటే, ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే అని చెబుతోంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ లో 1.5K రిజల్యూషన్ కలిగిన 3D Curved pOLED డిస్ప్లే ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
అంతేకాదు, ప్రముఖ US కలర్ సొల్యూషన్ కంపెనీ Pantone తో వ్యాలిడేట్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే అవుతుందని మోటోరోలా పేర్కొంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్, HDR 10+, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కూడా ఉంటుంది.
ఈ ఫోన్ లాంఛ్ డేట్ ప్రకటించక ముందే ఇలాంటి వివరాలను కంపెనీ టీజ్ చేస్తోందంటే, ఈ ఫోన్ పూర్తి వివరాలు బయటకి వస్తే ఈ ఫోన్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు.