MOTOROLA Edge 50 Neo స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 30x టెలీ ఫోటో కెమెరా మరియు ఆకట్టుకునే డిజైన్ వంటి మరిన్ని ఫీచర్స్ తో మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను చాలా ఆకట్టుకునే ఫీచర్స్ తో చేసినా ఈ ఫోన్ ధరను మాత్రం బడ్జెట్ మార్కెట్ లో ప్రస్తుతం నడుస్తున్న చాలా ఫోన్ లకు గట్టి పోటీ ఇచ్చేలా అందించింది. మరి ఈ మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 8GB + 256GB సింగల్ వేరియంట్ తో కేవలం రూ. 23,999 ధరకే అందించింది. ఈ ఫోన్ ను మరింత చావా ధరకు అందుకునేలా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను ఈ ఆఫర్ తో రూ. 22,999 ధరకే అందుకునే అవకాశం వుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్ ను Super HD (1.5K) రిజల్యూషన్ కలిగిన AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ HDR 10+ సపోర్ట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 చిప్ సెట్, 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో లాంచ్ చేసింది.
ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ కెమెరా సెటప్ లో
50MP Quad PDAF మెయిన్ + 13MP అల్ట్రా వైడ్ + 10MP టెలిఫోటో కెమెరా లను కలిగి వుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫైన్ తో 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ మరియు 3X ఆప్టికల్ జూమ్ తో గొప్ప లాంగ్ ఎక్స్ పోజర్ ఫోటోలు పొందవచ్చని మోటోరోలా తెలిపింది.
Also Read: భారీ ఆఫర్స్ తో Amazon Great Indian Festival Sale డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్.!
ఈ ఫోన్ IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ మరియు మిలటరీ గ్రేడ్ MIL-STD 810H ప్రొటెక్షన్ వంటి అదనపు ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ సపోర్ట్ వుంది.