MOTOROLA Edge 50 Neo ఆకట్టుకునే ధరలో సూపర్ కెమెరా మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది.!

MOTOROLA Edge 50 Neo ఆకట్టుకునే ధరలో సూపర్ కెమెరా మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది.!
HIGHLIGHTS

MOTOROLA Edge 50 Neo స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

ఆకట్టుకునే డిజైన్ వంటి మరిన్ని ఫీచర్స్ తో మార్కెట్లో లాంచ్ చేసింది

ఈ మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా

MOTOROLA Edge 50 Neo స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 30x టెలీ ఫోటో కెమెరా మరియు ఆకట్టుకునే డిజైన్ వంటి మరిన్ని ఫీచర్స్ తో మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను చాలా ఆకట్టుకునే ఫీచర్స్ తో చేసినా ఈ ఫోన్ ధరను మాత్రం బడ్జెట్ మార్కెట్ లో ప్రస్తుతం నడుస్తున్న చాలా ఫోన్ లకు గట్టి పోటీ ఇచ్చేలా అందించింది. మరి ఈ మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.

MOTOROLA Edge 50 Neo : ధర

మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 8GB + 256GB సింగల్ వేరియంట్ తో కేవలం రూ. 23,999 ధరకే అందించింది. ఈ ఫోన్ ను మరింత చావా ధరకు అందుకునేలా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను ఈ ఆఫర్ తో రూ. 22,999 ధరకే అందుకునే అవకాశం వుంది.

MOTOROLA Edge 50 Neo : ఫీచర్స్

మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్ ను Super HD (1.5K) రిజల్యూషన్ కలిగిన AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ HDR 10+ సపోర్ట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 చిప్ సెట్, 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో లాంచ్ చేసింది.

Motorola-g45-5G-Features-1
Motorola G45 5G Features

ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ కెమెరా సెటప్ లో
50MP Quad PDAF మెయిన్ + 13MP అల్ట్రా వైడ్ + 10MP టెలిఫోటో కెమెరా లను కలిగి వుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫైన్ తో 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ మరియు 3X ఆప్టికల్ జూమ్ తో గొప్ప లాంగ్ ఎక్స్ పోజర్ ఫోటోలు పొందవచ్చని మోటోరోలా తెలిపింది.

Also Read: భారీ ఆఫర్స్ తో Amazon Great Indian Festival Sale డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

ఈ ఫోన్ IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ మరియు మిలటరీ గ్రేడ్ MIL-STD 810H ప్రొటెక్షన్ వంటి అదనపు ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ సపోర్ట్ వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo