Motorola Edge 50 Neo: Sony LYTA లేటెస్ట్ కెమెరా మరియు సూపర్ స్క్రీన్ తో లాంచ్ అవుతోంది.!

Updated on 09-Sep-2024
HIGHLIGHTS

Motorola Edge 50 Neo స్మార్ట్ ఫోన్ సూపర్ స్క్రీన్ తో లాంచ్ అవుతోంది

Sony LYTA లేటెస్ట్ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంది

. ఈ ఫోన్ ను సరికొత్త కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది

Motorola Edge 50 Neo: మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను Sony LYTA లేటెస్ట్ కెమెరా మరియు సూపర్ స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు మరిన్ని ఫీచర్స్ ఉన్నాయని కూడా మోటోరోలా లాంచ్ కంటే ముందే టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను సరికొత్త కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది.

Motorola Edge 50 Neo: లాంచ్

మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Flipakrt ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ తో కూడిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది.

Motorola Edge 50 Neo: కీలకమైన ఫీచర్స్

మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్ లో 6.4 ఇంచ్ సూపర్ HD LTPO స్క్రీన్ తో లాంచ్ అవుతుందట. ఈ స్క్రీన్ 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 10 బిట్ కలర్ సపోర్ట్ స్క్రీన్ మరియు ఇది గొరిల్లా గ్లాస్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది.

ఈ ఫోన్ ను మిలటరీ గ్రేడ్ MIL – STD 810H సర్టిఫికేషన్ తో వస్తుంది. ఇది షాక్, ప్రెజర్, డస్ట్, అధిక వేడిమి మరియు శీతల వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకుంటుందట. అంతేకాదు, IP రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ నాటికల్ బ్లూ, లాట్టె, గ్రిజైల్ మరియు పోయన్షియనా అనే నాలుగు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Also Read: Realme Buds N1: 46dB హైబ్రిడ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో బడ్జెట్ ధరలో లాంచ్.!

ఈ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 50MP Sony-LYTIA 700C ప్రధాన కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్ మరియు మరొక సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ ను Android 14 OS తో లాంచ్ చేస్తున్నట్లు మరియు ఇది 5 OS అప్గ్రేడ్ లను అందుకుంటుందని కూడా మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ ను 67W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4310 mAh బ్యాటరీ తో వస్తుందని కూడా మోటోరోలా తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :