MOTOROLA Edge 50 ఫోన్ ఊహించనంత తక్కువ ధరలో జబర్దస్త్ ఫీచర్స్ తో ఈరోజు మార్కెట్లో లాంచ్ అయ్యింది. మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కలిగిన అత్యంత నాజూకైన ఫోనుగా మోటోరోలా ఈ ఫోన్ ను భారత్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ డిస్ప్లే, కెమెరా సిస్టం మొదలు కొని మోటో AI వరకు చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కలిగి వుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్ ను సూపర్ HD+ 1.5K రిజల్యూషన్ కలిగిన 6.67 ఇంచ్ oLED స్క్రీన్ వుంది. ఇది ఎండ్ లెస్ కర్వుడ్ స్క్రీన్ మరియు HDR10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ బడ్జెట్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 7 Gen 1 AE (యాక్సిలరేటెడ్ ఎడిషన్) తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
మోటోరోలా ఈ కొత్త ఫోన్ ను వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాతో అందించింది. ఎడ్జ్ 50 లో వెనుక OIS 50MP (Sony LYT-700C) మెయిన్ + 13MP అల్ట్రా వైడ్ + 10MP టెలిఫోటో సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా వుంది. ఈ ఫోన్ కెమెరా Moto Ai సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప ఫోటోలతో పాటు 30fps వద్ద 4K వీడియోలు అందిస్తుందని మోటో తెలిపింది. అలాగే, మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.
ఇక ఈ ఫోన్ ఇతర ఆకర్షణీయమైన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ MIL-810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో వస్తుంది. ఈ ఫోన్ IP 68 అండర్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 68W టర్బో పవర్ మరియు 15W ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ వుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.
Also Read: Exclusive: 12 వేల ధరలో 108MP కెమెరాతో Poco M6 Plus 5G లాంచ్.!
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 27,999 ధరతో విడుదల చేసింది. ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి Flipakrt మరియు మోటోరోలా అధికారిక వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను Axis మరియు IDFC క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనే వారికి రూ. 2,000 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది.