మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Motorola Edge 50 Fusion లాంచ్ డేట్ తో పాటు కీలక ఫీచర్స్ ను కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 16 May 2024 తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు మోటోరోలా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ బెస్ట్ 50MP Sony – LYTIA 700C సెన్సార్ కెమెరా తో తీసుకొస్తున్నట్లు తెలిపింది.
మోటోరోలా అప్ కమింగ్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది. ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే, కెమెరా మరియు మరిన్ని ఇతర కీలకమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
Also Read: Google Pixel 8a: Google AI పవర్ తో వచ్చిన గూగుల్ ఫోన్.!
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను 6. 7 ఇంచ్ 3D Curved pOLED డిస్ప్లేతో అందిస్తున్నట్లు తెలిపింది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు DCI-P3 కలర్ గెమూట్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 ప్రోసెసర్ తో పని చేస్తుందని మరియు జతగా 12GB వరకు RAM ఉంటుందని కోడోత్ మోటోరోలా తెలిపింది.
ఈ ఫోన్ IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ తో కూడా వస్తోంది. ఈ ఫోన్ లో 2μm అల్ట్రా పిక్సెల్ కలిగిన 50MP Sony – LYTIA 700C మెయిన్ కెమెరాతో వస్తుంది. దీనికి జతగా 13MP (అల్ట్రా వైడ్ + మ్యాక్రో) సెన్సార్ కూడా వుంది. ఈ కెమెరాతో 30fps వద్ద 4K వీడియో లను షూట్ చేయవచ్చని తెలిపింది. అలాగే, ముందు 32 సెల్ఫీ కెమెరా ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది.
ఈ ఫోన్ యొక్క ఇతర ఫీచర్స్ ను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ను 68W టర్బో పవర్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉన్నట్లు క్లియర్ గా తెలిపింది. ఈ మోటోరోలా ఫోన్ ఫారెస్ట్ బ్లూ, మార్ష్మెల్లో బ్లూ మరియు హాట్ పింక్ అనేది మూడు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుంది.